Ticker

6/recent/ticker-posts

Ad Code

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

పెద్దపల్లి ఆగష్టు 19, (ఇయ్యాల తెలంగాణ ); ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ తెలిపారు.శనివారం ఎన్నికల కవిూషన్‌ ఆదేశాల మేరకు పెద్దపల్లి  నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన  ఓటరు అవగాహన 5కే రన్‌ లో జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం నుంచి అమర్‌ నగర్‌, మసీద్‌ చౌరస్తా జండా చౌరస్తా, సుభాష్‌ విగ్రహం, కమాన్‌ విూదుగా తిరిగి ప్రభుత్వ జూనియ ర్‌ కళాశాల వరకు 5కే రన్‌  ను నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కూడలి వద్ద మానవహారం ఏర్పాటు చేసి, హాజరైన వారినుద్దే శించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, నమోదైన ప్రతి ఓటరు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించు కోవాలని ప్రజలలో చైతన్యం కలిగించేందుకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు  5కే రన్‌ నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. వర్షం పడుతున్నప్పటికీ ఓటు ప్రాము ఖ్యత వివరిస్తూ 5కే రన్‌ నిర్వహించామని అన్నారు. పోలింగ్‌ రోజున ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు సక్రమంగా వినియోగించు కోవాలని కలెక్టర్‌ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ లయన్స్‌ క్లబ్‌, వాకర్స్‌ అసోసియేషన్‌, తహశీల్దార్లు, మునిసి పల్‌ అధికారులు, యువకులతో మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన వారు మన ఇంట్లో, చుట్టుప్రక్కల ఉన్న వారు అందరూ విధిగా ఓటు హక్కు కలిగి, ఎన్ని సమస్యలు ఉన్న ఓటింగ్‌ రోజు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎం.పి.డి.ఓలు, ఉద్యోగులు, యువకులు, విద్యార్థిని, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు