Ticker

6/recent/ticker-posts

Ad Code

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

 జగిత్యాల ఆగష్టు 19, ఇయ్యాల తెలంగాణ; ఒకే శాఖ, ఒకే విధమైన సేవలు అందిస్తున్న జీత భత్యాల్లో తేడా పిలుపులోను తేడా చూపించడంలో ఆంతర్యం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు.రాష్ట్రంలో ప్రాథమిక వైద్య  సేవలు అందింపజేసే సెకండ్‌ ఏఎన్‌ఎంగా పేర్కొనబడుతున్న  వారిని క్రమబద్ధీకరించాలనే భావనతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా చేపడుతున్నటువంటి నిరసనకు కరీంనగర్‌  పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు,  సుప్రీంకోర్టు న్యాయవాది కోమిరెడ్డి కరంచంద్‌ లు సంఫీుభావం శుక్రవారం తెలిపారు.మూడు రోజులుగా జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ముందు ఏఐటీయూసి ఆధ్వర్యంలో తెలంగాణ ఏఎన్‌ఎం ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాండ్ల మధురిమ నేతృత్వంలో జిల్లాలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఏఎన్‌ఎం లు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు.ఈ సందర్బంగా ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మాట్లాడుతూకరోన కష్టకాలంలో కుటుంబాలను వదిలి, ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు స్వంత వారు దగ్గరకు రాకున్నా ఒక సోదరిలాగా  ఏఎన్‌ఎంలు సేవలు అందించారని గుర్తు చేస్తూ ప్రభుత్వానికి ఇది తెలియదా అని ప్రశ్నించారు.వాస్తవంగా నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఏ హాస్పిటల్‌ వెళ్లిన ముందుగా కనబడేది రెండవ ఏఎన్‌ఎంలని, ఏఎన్‌ఎంలు, 2 వ ఏఎన్‌ఎంలు ఒకటే విధం అయినటువంటి సేవలు అందిస్తున్నప్పుడు ఒకే విధంగా పిలువబడాలి కానీ ఒకరు ఫస్ట్‌ ఏఎన్‌ఎం ఒకరు సెకండ్‌ ఏఎన్‌ఎం అనడం సమంజసం కాదని, అలాగే కల్పించబడే వేతబత్యాలు కూడా ఒకరికి శాశ్వత ప్రాతిపదికన స్కేల్‌ కల్పిస్తూ ఇంకొకరికి కన్సల్టెంట్‌ సాలరీతో విధులు పొందడం సమంజసం కాదని న్యాయస్థానానికి పోయినా చెల్లదని అన్నారు. ఓకే విధమైనటువంటి సేవ అందిస్తున్న వారికి ఒకే విధమైన సాలరీ అందింప చేయడం ప్రభుత్వంపై ఉంటుందని,తెలంగాణ ఉద్యమం స్థానిక ప్రాధాన్యత అంశంగా తాత్కాలిక పదం అనేది లేకుండా ప్రభుత్వపరంగా బాధ్యతను నిర్వహింప బడేటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా వారికి శాశ్వత ప్రాతిపదికనే పరిగణించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంటాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ వ్యవస్థనే తొలగిస్తామని చెప్పిన కేసీఆర్‌ హావిూ ఏమయిందని ప్రశ్నించారు.ఉద్యమమనేది ఏ ఒక్కరితో సాధ్యమైంది కాదని యావత్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం తెలంగాణలో సేవలందిస్తున్నటువంటి వివిధ శాఖలలో పని చేస్తున్నటువంటి ఉద్యోగస్తులే కానీ విద్యార్థులే గాని సకలజనుల సమ్మెతో కేంద్ర ప్రభుత్వాన్ని స్పందింప చేయడంతోనే  కేంద్ర ప్రభుత్వం స్పందించి దశాబ్దాల తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చాలని భావనతోని సోనియా గాంధీ   తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఇవాళ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది ప్రసూతి వైద్య సేవలు ప్రదాన పాత్ర పోషిస్తున్నది ఏఎన్‌ఎం, సెకండ్‌ ఏఎన్‌ఎంలని చెప్పక తప్పదన్నారు. కేసీఆర్‌ కిట్‌,న్యూట్రిషన్‌ కిట్‌ ఎవరు అందింపచేస్తు, ఇవాళ పురుడు పోస్తున్నది సెకండ్‌ ఏఎన్‌ఎంలని,  ఏ ఆడబిడ్డ ప్రసూతి కావాలన్నా వారికి సెకండ్‌ ఏఎన్‌ఎం కనబడుతున్నారని, గ్రామాలలో తిరిగి గర్భిణీ స్త్రీని ప్రభుత్వ వైద్యాలయాల వైపు మళ్ళింపజేయడమే కాకుండా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సేవలు వారికి కల్పించబడే విధంగా సేవలు అందిస్తుంది ఏఎన్‌ఎంలు సెకండ్‌ ఏఎన్‌ఎంలని జీవన్‌ రెడ్డి గుర్తు చేశారు.కన్న తల్లిలాగా  ఏఎన్‌ఎం లు సేవాలాందిస్తున్నారని అటువంటి ఆడబిడ్డలను రెగ్యులరైజ్‌ చేయకుండా ఇబ్బందిపెట్టడం సరికాదాన్నారు.   కంటి వెలుగులో డాక్టర్‌ చేయాల్సిన కంటి పరీక్షలు కూడా సెకండ్‌ ఏఎన్‌ఎం లు వైద్యులు చేసే పని కూడా ఏఎన్‌ఎంలు చేశారని చెప్పారు.ఆడబిడ్డల ఉసురు పోసుకుంటే భస్మం అవుతారని హెచ్చరించారు.శాసన మండలిలో ఈ సమస్యపై తాను చర్చిస్తే ఎమ్మెల్సీ కవిత జిల్లా పరిషత్‌ లో మాట్లాడాలని అపహాస్యం చేశారని మండిపడ్డారు. తోటి మహిళలను గౌరవించాల్సిన బాధ్యత కవితకు లేదా అని ప్రశ్నించారు.రాష్ట్రంలో 5600 మంది ఏఎన్‌ఎం లను రెగ్యులరైజ్‌ చేసి ఇంకా సిబ్బంది అవసరమానుకుంటే నోటిఫికేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.2018 ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో తాను ఆశించిన ఫలితం పొందలేకపోయిన ఉమ్మడి నాలుగు జిల్లాల పట్టభద్రులు ఒక ప్రశ్నించే గొంతుక ఉండాలనే ఆలోచనతో జీవన్‌ రెడ్డి కి ఓటు వేసి గెలిపించారని అందుకనుగుణంగా పనిచేస్తున్నాని చెప్పారు.రాబోయే కాలంలో ఏ ప్రభుత్వం వచ్చిన నా పదవి కాలం ఇంకో 18 నెలలు ఉంటుందని తప్పకుండా 5,600 మంది ఏఎన్‌ఎం లను క్రమబద్ధీకరించే వరకు పోరాడుతానని, అలాగే విూ సమస్యను పరిష్కరింపబడేలా చేస్తానని జీవన్‌ రెడ్డి  ఏఎన్‌ఎంలకు హావిూ ఇచ్చారు.కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు బండ శంకర్‌, ముంజాల రఘువీర్‌ గౌడ్‌, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు గుండా మధు, ఏఎన్‌ఎం లు వెంగల నీరజ,పద్మ, జమున, మమత, రాధ, శిరీష, పి. శిరీష, మేరీ, ఎలిజబెత్‌ రాణి, గణిత, శారద, దీవెన, సరోజ, ఊర్మిళ, ఏ.లత, కోమల, శైలజ లక్ష్మీ, భాగ్య, రామక్క, అరుణ, సంధ్య, సత్యగంగా, 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు