హైదరాబాద్, ఆగస్టు 14 (
ఇయ్యాల తెలంగాణ ): మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సొంతిల్లు లేదని ఓ చేనేత కార్మికురాలు మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. అడిగిందే తడవుగా ఆ చేనేత కార్మికురాలికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకంలో తొలి లబ్ధిదారుగా ఎంపికైంది. వివరాల్లోకి వెళ్తే. చేనేత వారోత్సవాల్లో భాగంగా యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఔత్సాహిక యువ చేనేత కళాకారుడు షైనీ భరత్ ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ ను మంత్రి ప్రారంభించారు.మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సొంతిల్లు లేదని ఓ చేనేత కార్మికురాలు మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. అడిగిందే తడవుగా ఆ చేనేత కార్మికురాలికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకంలో తొలి లబ్ధిదారుగా ఎంపికైంది. వివరాల్లోకి వెళ్తే. చేనేత వారోత్సవాల్లో భాగంగా యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఔత్సాహిక యువ చేనేత కళాకారుడు షైనీ భరత్ ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం హ్యాండ్లూమ్ సెంటర్?లో చేనేత కార్మికులను కలిసిన మంత్రి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చుక్కా పావని అనే చేనేత కార్మికురాలు తన భర్త దివ్యంగుడని, ఆతను కూడా చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడని మంత్రికి వివరించారు.తనకు సొంత ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని, ఇల్లు కట్టుకోవడానికి ఆర్ధిక సహాయం చేయాలని మంత్రికి తన గోడును వెళ్లబోసుకుంది. మంత్రి కేటీఆర్ చేనేత కార్మికురాలు పావని పరిస్థితిని అర్ధంచేసుకొని గృహాలక్ష్మి పథకాన్ని పావనికి మంజూరు చేయాలనిఅధికారులను ఆదేశించారు. చుక్క పావనికి మంత్రి కేటీఆర్ ఇచ్చిన హావిూని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి నెరవేర్చారు. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి?లు పథకానికి సంబంధించిన ప్రొసీడిరగ్ పత్రాన్ని పావని కుటుంబానికి అందజేసి మంత్రి కేటీఆర్ ఇచ్చిన హావిూని నెరవేర్చారు. దీంతో రాష్ట్రంలో మొట్ట మొదటి గృహాలక్ష్మి పథకంలో తొలి లబ్ధిదారురాలిగా పావని రికార్డులకు ఎక్కింది. నేత కార్మికురాలికి గృహలక్ష్మి పథకం అందజేయడం సంతోషంగా ఉందని, నిజమైన పేదల నాయకుడు కేటీఆర్ అని ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి అన్నారు. తమ పరిస్థితిని చూసి మంత్రి కేటీఆర్ గృహలక్ష్మి పథకంలో తొలి లబ్ధిదారురాలిగా సహాయాన్ని మంజూరు చేయడం పట్ల పావని సంతోషం వ్యక్తం చేస్తోంది.ఇదిలా ఉండగా రాష్ట్రంలో చాలామంది పేద ప్రజలు ఇళ్లు లేక ఎన్నో అవస్థలు పడుతన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గృహలక్ష్మీ పథకాన్ని చేపడుతోంది. దీనివల్ల సొంతిళ్లు లేని ఎంతోమంది ప్రజల కళ నెరవేరుతుందని బీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు మరికొన్ని నెలల్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడం, గృహలక్ష్మీ పథకం అమలు చేయడం వల్ల ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే పేద ప్రజలకు ఉచితంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తుండగా.. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ‘గృహలక్ష్మి’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థికసాయం అందించనున్నది
0 కామెంట్‌లు