కామారెడ్డి ఆగష్టు 14 (
ఇయ్యాల తెలంగాణ ):సోమవారం నాడు కామారెడ్డి చేరుకున్న మంత్రి KTR కు, నర్సన్న పల్లి బైపాస్ వద్ద ఘనస్వాగతం లభించింది. న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తదితరులు అయనకు స్వాగతం పలికారు. ముందుగా మంత్రి కేటీఆర్ మున్సిపల్ స్వాగత తోరణాన్ని ప్రారంభించారు. హౌసింగ్ బోర్డు, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ ను ల ఆవిష్కరించారు. మంత్రికి BRSశ్రేణులు బైక్ ర్యాలీ తో స్వాగతం పలికారు.అంతకుముందు
మంత్రి KTR నిరసన సెగ తగిలింది. కామారెడ్డి జిల్లా దేవునుపల్లి వద్ద ఆయన కాన్వాయ్ని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొంతసేపు అక్కడ గందరగోళం ఏర్పడిరది..
0 కామెంట్‌లు