హైదరాబాద్ ఆగష్టు 5 (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనంపై గవర్నర్ తమిళిసై నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందా ? ఆర్టీసీ బిల్లుపై కేసీఆర్ సర్కార్ ఇచ్చిన వివరణ పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.కానీ ఆర్టీసీ ఆస్తులపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి తెలపనున్నారా.! లేదా అనే విషయం శనివారం సాయంత్రం కల్లా పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు వచ్చినంక గవర్నర్ ప్రకటిస్తారని సమాచారం . ఇవాళ రాత్రిలోగా ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపనున్నట్లు అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆర్టీసీ సంస్థ , ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా బిల్లుపై న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం తమిళిసై పచ్చజెండా ఊపనున్నారని తెలుస్తోంది? ఈ విషయం బయటికి రావడంతో ఆర్టీసీ కార్మికులు ఆనందంలో మునిగితేలుతున్నారట. మొదట ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లులో అభ్యంతరాలు ఉన్నాయంటూ గవర్నర్ తమిళిసై బిల్లును అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈమేరకు కాపీని రాజ్‌భవన్‌కు పంపించింది. ఆర్టీసీ కార్మికులకు కార్పొరేషన్ కంటే మెరుగైన జీతాలు ఉంటాయని ప్రభుత్వం అందులో పేర్కొన్నది. విలీనమైన తర్వాత రూపొందించే గైడ్‌లైన్స్‌లో అన్ని అంశాలు ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ సమస్యలను ఆంధ్రప్రదేశ్ తీరుగానే పరిష్కరిస్తామని వెల్లడిరచింది.తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లు రూపొందించింది. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ విలీనం బిల్లు పాస్ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది.
తెలంగాణ ప్రభుత్వంలో TS RTC విలీనంపై గవర్నర్ సానుకూల నిర్ణయం ప్రకటించనున్నారా ?
శనివారం, ఆగస్టు 05, 2023
0
Tags