హైదరాబాద్ ఆగష్టు 19, ఇయ్యాల తెలంగాణ; కోర్టు చెప్పినా ప్రభుత్వం నాకు సెక్యూరిటీ ఇవ్వడం లేదని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎంపీగా ఉన్నాను, జాతీయపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు సెక్యూరిటీ తొలగిస్తారా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కి కావాల్సినంత సెక్యూరిటీ ఇచ్చాం. నేను ప్రజల మనిషిని నాకు సెక్యూరిటితో పనిలేదు. నేను సెక్యూరిటీ లేకుండ ఎక్కడికైనా వస్తాను. సెక్యూరిటీ లేకుండ ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు కేసీఆర్ రాగలరా? నన్ను ఓడిరచడానికి పోలీసులను కేసీఆర్ వాడుకున్నారని అన్నారు. సెక్యూరిటీ విషయంలో నన్ను భయపెట్టాలని చూస్తే భయపడేవాడ్ని కాదు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నా సైన్యం. నా సెక్యూరిటీ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ మైనార్టీ అనే తేడా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ మైనార్టీల కోసం ఏం చేయలేదని అన్నారు.
0 కామెంట్‌లు