Ticker

6/recent/ticker-posts

Ad Code

రాగల రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

      

హైదరాబాద్‌ ఆగష్టు 18, ఇయ్యల తెలంగాణ ; రాగల రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది.జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే భారీ వర్షాలు, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు