విజయవాడ ఆగష్టు 18, ఇయ్యాల తెలంగాణ;మొదటి శ్రావణ శుక్రవారం సందర్బంగా ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయాన్ని వివిధ వర్ణముల పూలతో సుందరముగా అలంకరించారు. అమ్మవారి దర్శనార్ధం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లును ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ పర్యవేక్షించారు. నిత్య ఆర్జిత సేవలైన శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్షకుంకుమార్చన, శ్రీచక్రనవావరణార్చన, చండీహోమం, శాంతికళ్యాణం, ఇతర సేవల లో భక్తులు పాల్గొని, శ్రీఅమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు.
0 కామెంట్‌లు