Ticker

6/recent/ticker-posts

Ad Code

ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు స్వాధీనం


అన్నమయ్య ఆగష్టు 10 (ఇయ్యాల తెలంగాణ): అన్నమయ్య జిల్లా సానిపాయ రేంజిలో రెండు వేర్వేరు కేసుల్లో 32ఎర్రచందనం దుంగలు, ఒక కారు, ఒక మోటారుసైకిల్‌ ను టాస్క్‌ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. రేణిగుంట మండలం కరకంబాడి ప్రాంతంలో ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. మూడు కేసుల వివరాలను డీఎస్పీ చెంచుబాబు గురువారం వెల్లడిరచారు. కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్‌ కుమార్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు అధ్వర్యంలోని మూడు టీమ్‌ లు బుధవారం కూంబింగ్‌ చేపట్టాయి. ఆర్‌ఐలు సురేష్‌ కుమార్‌ రెడ్డి, చిరంజీవులకు చెందిన ఆర్‌ఎస్‌ఐలు పి.నరేష్‌, లింగాధర్‌ టీమ్‌ లు అన్నమయ్య జిల్లా సానిపాయ నుంచి కూబింగ్‌ చేపట్టారు. రాయవరం సెక్షన్‌ లోని అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టగా, శేషాచలం ఎక్స్‌ టెన్షన్‌ రిజర్వు ఫారెస్టులో కొందరు కారులో ఎర్రచందనం దుంగలను లోడ్‌ చేస్తూ కనిపించారు. వారిని చుట్టుముట్టి అక్కడున్న10ఎర్రచందనం దుంగలు, ఒక కారు, ఒక మోటారు సైకిల్‌ ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరు తాలూకాకు చెందిన టీ.వెంకడేశన్‌ (26), హరి (46), చిత్తూరు జిల్లా కోట మండలానికి చెందిన కేసీ విజయకుమార్‌(33)లను అరెస్టు చేశారు. మరో కేసులో ఆర్‌ఐ సురేష్‌ కుమార్‌ రెడ్డి టీమ్‌ లోని  ఆర్‌ఎస్‌ఐ విష్ణువర్ధన్‌ కుమార్‌, విశ్వనాథ్‌ టీమ్‌ లు  సానిపాయ రేంజిలోని వానరాచపల్లి ఫారెస్టు బీటులో కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వారిని హెచ్చరించి చుట్టుముట్టగా వారు దుంగలను పడేసి పారిపోయారు. అయితే ముగ్గురుని పట్టుకున్నారు. నిందితులు తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరు ప్రాంతానికి చెందిన పొన్నుస్వామి శరత్‌ (19), చిన్నరాజి పచ్చయప్పన్‌ (20), నడిపయ్యన్‌ మణి (50)లను అరెస్టు చేశారు. వీరి నుంచి 22ఎర్రచందనం దుంగలు లభించాయి.  తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరు ప్రాంతానికి చెందిన పొన్నుస్వామి శరత్‌ (19), చిన్నరాజి పచ్చయప్పన్‌ (20), నడిపయ్యన్‌ మణి (50)లను అరెస్టు చేశారు. వీరి నుంచి 22ఎర్రచందనం దుంగలు లభించాయి. రేణిగుంట మండలం కరకంబాడి  రోడ్డులోని మామండూరు వద్ద ఆర్‌ఐ కృపానంద, ఆర్‌ఎస్‌ఐ ఆలీ బాషా కూంబింగ్‌ చేస్తుండగా, టాటా ఇండికా కారు కనిపించింది. 
దానికి డ్రైవరు, యజమాని ఎవరూ లేక పోవడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన కార్లకు ఏపీ నెంబర్లు వేసుకుని ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు టాస్క్‌ ఫోర్సు పోలీసులు తెలుసుకున్నారు.  ఈ కేసులను తిరుపతి టాస్క్‌ ఫోర్సు పోలీసు స్టేషనులో నమోదు చేయగా,  సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ రఫీ విచారిస్తున్నారు. దాదాపు టన్నుకు పైగా ఉన్న ఎర్రచందనం దుంగలు విలువ రూ.50లక్షలకు పైగా ఉంటుందని డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. ఆపరేషన్లలో పాల్గొన్న సిబ్బందికి డీఐజీ సెంథిల్‌ కుమార్‌ రివార్డులు ప్రకటించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు