హైదరాబాద్ ఆగష్టు 27 (ఇయ్యాల తెలంగాణ );భావి ప్రపంచాన్ని శాసించేది ఆహారరంగమే. సృష్టిలో మారనిది ఒకే ఒక్కటి వ్యవసాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన తెలుగు రైతుబడి యూట్యూబ్ ఛానల్ 1 మిలియన్ స్టోన్ మెగా ఈవెంట్ లో ముఖ్య అతిథిగా మంత్రి హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సమాచార శాఖ మాజీ కవిూషనర్, సీనియర్ జర్నలిస్ట్ కట్టా శేఖర్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ రాజావరప్రసాద్ రావు, రైతుబడి యూట్యూబ్ ఛానల్ అధినేత రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.మంత్రి మాట్లాడుతూ మానవుడు స్థిరమైన వ్యవసాయం కనుక్కుని ఆచరించడం పదివేల సంవత్సరాలు అయింది. గత 120 ఏళ్ల కాలంలో వ్యవసాయరంగంలో అనేక మార్పులు సంభవించాయి. స్వాతంత్య్ర వచ్చిన కొత్తలో దేశంలో తిండిగింజలకే కొరత ఉండేది. అప్పట్లో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ చేనేత. 1963 తర్వాత వచ్చిన సస్యవిప్లవం మూలంగా వచ్చిన ఎరువులు, నూతన వంగడాలతో పంటలలో దిగుబడి పెరిగిందిభారతదేశ వ్యవసాయ పితామహుడు అంటే బాబూ జగ్జీవన్ రామ్ అనే చెప్పాలని అన్నారు. సహజ ఎరువుల వినియోగం పెంచాలి. మనం తినే ఆహారంలో సమతుల్యత లేక అనారోగ్యం బారిన పడుతున్నాం. ఆరోగ్యవంతమైన భవిష్యత్ తరాల కోసం నేల ఆరోగ్యాన్ని పెంచేందుకు అందరం కృషిచేయాలి. రైతు తలఎత్తుకునే పరిస్థితి లేని దుస్థితి నుండి నేడు తెలంగాణలో నేను రైతును అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారుపనిచేయని వారికి, కష్టపడని వారికి ఈ భూమి విూద తినే హక్కు లేదని అయన అన్నారు. రైతుబడి ఛానల్ నిర్వహణ ఒక ఉదాత్తమైన ఆశయం. యూట్యూబ్ ఛానళ్లు ప్రస్తుతం సమాజానికి ఉపయోగపడుతున్నట్లు లేవు. కానీ ఈ వ్యవసాయ యూట్యూబ్ ఛానల్ రైతులకు ఎంతో ఉపకరిస్తున్నదని అన్నారు.శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం అంటే దండగ అన్న స్థితి నుండి కేసీఆర్ నాయకత్వంలో పండగ చేసుకున్నాం. రైతుబంధు, రైతుభీమా, సాగునీళ్లు, కరంటు, పంటల కొనుగోళ్లతో రైతుకు అండగా నిలిచారు. రైతుకు వ్యవసాయం గురించి సమాచారం ఇవ్వడం అవసరం. ప్రతి ఐదువేల ఎకరాలకు క్లస్టర్ ఏర్పాటు చేసి, రైతువేదిక నిర్మించి, వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించింది. రైతుబడి ద్వారా రైతుల విజయాలు, ఇబ్బందులను బయటకు తీసుకు రావడం కోసం రాజేందర్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు.
ప్రపంచాన్ని శాసించేది ఆహారరంగమే మంత్రి నిరంజన్ రెడ్డి
ఆదివారం, ఆగస్టు 27, 2023
0
Tags