జగిత్యాల ఆగష్టు 30 (ఇయ్యాల తెలంగాణ ): షోకాజ్ నోటిసులకు భయపడకండి
సమ్మె ఉద్యోగుల జన్మ హక్కు అని, సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎం లను విధులకు రావాలని అధికారులు భయపెట్టడం సమంజసం కాదని, వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భరోసా ఇచ్చారు.జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట జిల్లాలోని సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులరైజ్ చేయాలని ఏఐటియూసి అనుబంద తెలంగాణ ఏఎన్ఎం ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాండ్ల మధురిమ నాయకత్వంలో జరుగుతున్న సమ్మె మంగళవారం 14 వ రోజుకు చేరుకోగా ఏఎన్ఎంల దీక్షా శిబిరానికి డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ , మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి ,గొల్లపల్లి సర్పంచ్ ముస్కు నిశాంత్ రెడ్డి లు వెళ్లి సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్, విజయలక్ష్మి లు మాట్లాడుతూ గ్రామాల్లో అంటురోగాలు, ఇతర వ్యాధులు ప్రబలితే డాక్టర్లు కాదని ప్రజలతో మమేకమై ఏఎన్ఎం లు వైద్య సేవలు అందిస్తుంటారని గుర్తు చేశారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, కుటుంబాలను వదిలి సేవలందిస్తే ఇతర డిపార్ట్మెంట్ లో పనిచేసిన వారిని రెగ్యులరైజ్ చేసి వీరిని పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.అధికార బిఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవడం, మద్యం, డబ్బులు పంచి ఏవిధంగా అధికారంలోకి రావాలనే తాపత్రయం తప్పా నిత్యం ప్రజల్లో ఉంటున్న ఉద్యోగుల ఇబ్బందులను గుర్తించకపోవడం బాధాకరమన్నారు. గత జులై నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేసి రెగ్యులరైజ్ చేయాలని లక్ష్మణ్ కుమార్, విజయలక్ష్మి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత14 రోజులుగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలనే ఒక్క డిమాండుతో మహిళ సోదరీమణులు రోడ్డెక్కి నిరసనలు చేస్తుంటే జిల్లాకు చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే లు పట్టించుకోవడం లేదంటే వారికి ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యమో దీన్ని బట్టి తెలుస్తోందని విమర్శించారు. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ వ్యవస్థే ఉండదని, ధర్నాలు ఉండవన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. సమస్య పరిష్కరమైతే ఒకే, లేకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ,మేము విూ సమస్యను పరిష్కరిస్తామని, షోకాజ్ నోటీసులకు, అధికారుల బెదిరింపులకు ఎవరు బయపడకందని జీవన్ రెడ్డి తోపాటు కాంగ్రెస్ పార్టీ విూకు అండగా ఉంటుందని పునరుద్గటినీచారు. అందరూ ఐక్యంగా ఉంటే ప్రభుత్వం దిగివస్తుందన్నారు. మధురిమ మాట్లాడుతూమేము రోడ్డెక్కే పరిస్థితికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమన్నారు. ఆరోగ్య శాఖలో కీలకంగా పనిచేస్తున్న మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి రాష్ట్రంలోని సుమారు 6 వేల మందికి న్యాయం చేయాలని మధురిమ సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.మాకు న్యాయం జరిగేవరకు శాంతియుత పోరాటం చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని మధురిమ హెచ్చరించారు.కార్యక్రమంలో నిరజ, పద్మ, ఎలిజబెత్, ఊర్మిల, శిరీష, మేరీ, శారద, శిరీష, జయప్రద, ప్రశాంతి, రాజమణి, జమున, స్వరూప, చిలుకమ్మ, సుజాత,గణిత, సరోజ, పుష్ప, సౌజన్య, రమాదేవి, జ్యోతి, రజిత, విజయలక్ష్మి, రాధ, శైలజ, సునీత, అహల్య, లక్ష్మీకాంత, సుగుణ, మహేశ్వరి, షాహిన్, సుమలత తదితరులు పాల్గొన్నారు.