ముగ్గురు మృతిచెందగా, మరో 17 మంది గల్లంతు
కేదార్నాథ్ ఆగష్టు 5 ఇయ్యాల తెలంగాణ
ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్‌కు 16 కిలోవిూటర్ల దూరంలో ఉన్న గౌరికుండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో 17 మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గౌరీకుండ్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. భారీ స్థాయిలో రాళ్లు, మట్టిపెల్లలు పడడంతో.. రోడ్‌సైడ్ ఉన్న షాపులు, దాబాలు కొట్టుకుపోయాయి. అయితే ఆ షాపులు, దాబాల్లో నలుగురు స్థానికులతో పాటు 16 మంది నేపాలీలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ దళాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు జిల్లా అధికారులు వెల్లడిరచారు.ఉత్తరకాశీలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్‌తో ఉన్న బోర్డర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అరాకోట్`చిన్వా రూట్లో ఉన్న మోల్దీ వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. డజన్ల సంఖ్యలో స్థానిక గ్రామస్థులతో సంబంధాలు తెగిపోయాయి. ఆ రూట్లో వెళ్తున్న ప్రయాణికులు ఎక్కడిక్కడ నిలిచిపోయారు.