ఏలూరు ఆగష్టు 5,(ఇయ్యాల తెలంగాణ );ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామం నవోదయ విద్యాలయం లో ఫుడ్ పాయిజన్ కావడంతో
42 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురి అయ్యారు. సమాచారం తెలుసుకున్న దెందులూరు శాసన సభ్యుడు కొఠారి అబ్బాయి చౌదరి పెదవేగి తహసీల్దార్, మండల మేజిస్ట్రేట్ నల్లమెల్లి నాగరాజు పోలీస్ అధికారులు వివిధ శాఖల అధికారులు హుటాహుటిన పెదవేగి నవోదయ విద్యాలయ కు చేరుకున్నారు. ఈ నెల 3వ తేదీన ఈ పాఠశాలలో అంతర్రాష్ట్ర నవోదయ విద్యాలయాల విద్యార్థులకు జరిగే క్రీడల పోటీలలో పాల్గొనేందుకు కేరళ, కర్ణాటక, తదితర రాష్ట్రాలనుండి పెదవేగి నవోదయ పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాల యాజమాన్యం క్రీడాకారులకు గురువారం రాత్రి చికెన్ కర్రితో భోజనం శుక్రవారం ఉదయం వెజ్ బిర్యానీ పెట్టారు.ఈ రెండు ఆహార పదార్థాలలో ఎక్కడ తేడా జరిగిందో మరి ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అస్వస్థత పాలవడం తో పాఠశాల యాజమాన్యం దెందులూరు ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి, వివిధ శాఖల అధికారులు వారి ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తహసీల్దార్ ఎన్ నాగరాజు తెలిపారు.