హైదరాబాద్, ఆగస్టు 26, (ఇయ్యాల తెలంగాణ ); ఐదు రియల్ ఎస్టేట్ సంస్థలకు తెలంగాణ ‘రెరా’ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.ఐదు రియల్ ఎస్టేట్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది రెరా(రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ). ప్రీ లాంచింగ్ పేరుతో ప్లాట్ల అమ్మకాలు చేయడం, అనుమతి లేకుండా అదనపు నిర్మాణాలు చేపట్టడం సరికాదని తేల్చి చెప్పింది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్లాట్ల విక్రయాలు చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఆయా సంస్థలు 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఐదు సంస్థలు ఇవే:
`భువన తేజన్ఫ్ఫ్రా,
`రాధే గ్రూప్ రియల్ ఎస్టేట్స్
`టీఎంఆర్ సంస్థ
`ఓం శ్రీ బిల్డర్లు డెవలపర్స్
`సువర్ణ భూమిన్ఫ్ఫ్రా డెవలపర్స్ కంపెనీలు రెరా నోటీసులు అందుకున్న వాటిల్లో ఉన్నాయి. రెరా నిబంధనలు పాటించని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై చర్యలు తప్పవని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ హెచ్చరిచారు. ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో మోసాలు జరుగుతున్న నేపథ్యంలో రెరాలో నమోదు చేసుకున్న రియల్ ప్రాజెక్టుల్లో మాత్రమే ఇళ్లను కొనుగోలు చేయాలని కొనుగోలుదారులకు సూచించారు.కేంద్రం స్థిరాస్థి నియంత్రణ ప్రాధికార సంస్థ చట్టాన్ని 2017లో తీసుకొచ్చింది. రియల్ ఎస్టేట్ మోసాలను అరికట్టి కొనుగోలుదారులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం ఈ చట్టం తెచ్చింది. ఈ చట్టం ఆధారంగా రాష్ట్రాలు చట్టం చేసి కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాయి. ఇది ఇంటి కొనుగోలుదారులకు భద్రత కల్పించడంతో పాటు రియల్ ఎస్టేట్ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తుంది.500 చదరపు విూటర్లు, ఆపై విస్తీర్ణం గల స్థలంలో భవన నిర్మాణాలకు ఖీఇఖీం గుర్తింపు తప్పనిసరి. అంటే