Ticker

6/recent/ticker-posts

Ad Code

రానున్న కాలంలో అన్ని రంగాల్లో అగ్రగామి దేశంగా భారత్‌..

 

వేలూరు ఆగష్టు 19, ఇయ్యాల తెలంగాణ;ఈ దేశ యువతకు భారత్‌ లోనే మంచి భవిష్యత్తు ఉంది ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యా వంతులుగా ఎదగాలి కేంద్ర మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ వెల్లడి.

భారత్‌ 2047 నాటికి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చెందిన దేశంగా రూపాంతరం చెంది విశ్వ గురువుగా విరాజిల్లు తుందని కేంద్ర రోడ్లు రవాణా,విమానయాన శాఖా సహాయ మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ వెల్లడిరచారు.ఇందుకు 2015  నుంచే బీజం పడిరదని పేర్కొన్నారు. వేలూరులోని విఐటి యూనివర్సిటీ లో శుక్రవారం 38వ స్నాతకోత్సవం జరిగింది. ఈ స్నాతకోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కేంద్ర మంత్రి వీకే సింగ్‌ మాట్లాడుతూ  ప్రపంచ వ్యాప్తంగా నేడు 162దేశాలు భారత్‌ లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని అన్నారు.దేశంలో 62 విభిన్న రంగాల్లో పెట్టుబడులు  పెడుతున్నట్లు ఆయన తెలిపారు.ఈకారణంగా భారత్‌ లోని యువతకు భవిష్యత్తులో గొప్ప ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెండుగా రానున్నాయని తెలిపారు.నేటి విద్యార్థులే దేశ ప్రగతికి గమ్యానికి పునాదులు కావాలని సూచించారు.విద్యార్థులు విజయాలు అందిపుచ్చకునేందుకు అనుకూలమైన పుస్తకాలను చదవాలని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతిని సాధించిచే దిశగా అడుగులు వేయాలని కేంద్ర మంత్రి వీకే సింగ్‌ ఉద్బోధించారు.విద్యా విధానంలో  కేంద్ర సమూల మార్పులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోందని,తద్వారా ఎవరూ ఈ దేశం విడిచి పోకుండా స్వదేశంలోనే వారి సేవలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వైద్య విద్యారంగంలో మెడికల్‌ కళాశాలలను విస్తృతంగా తీసుకుని వస్తున్నామని తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించి మంచి భవిష్యత్తు సమకూర్చడానికి ఎన్నో త్యాగాలు చేస్తున్నారని తెలిపారు.విఐటి లాంటి విద్యాసంస్థలు విద్యార్ధులకు మంచి భవిష్యత్తు సమకూరుస్తున్నాయని, ఇలాంటి సంస్థ ఉత్తర భారత దేశంలో కూడా రావాలని తాను కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.దీనికి ముందు విఐటి వ్యవస్థాపకులు, ఛాన్సలర్‌ జి.విశ్వనాథన్‌ మాట్లాడుతూ దేశంలో పాఠశాల విద్య వరకు బాగా నడుస్తోందని, అయితే ఉన్నత విద్యలోముందుకు వెళ్లడానికి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు.మన దేశంలో యాభై శాతం లోపు మందికే విద్య లభిస్తోందని అన్నారు.  విద్యా రంగాల్లో  కేంద్ర ప్రభుత్వం ఇంకా పలు సంస్కరణలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఉన్నత విద్య కోసం బ్యాంకు రుణాలు తీసుకున్నవారికి కనీసం వడ్డీ అయినా ప్రభుత్వాలు భరించే విధంగా ఉండాలని  సూచించారు.వైద్య విద్య అభ్యసించడానికి ఏడాదికి ఇరవై లక్షల మంది ఆకాంక్షిస్తున్నా, ప్రభుత్వం ఏడు లక్షల మందికి మాత్రమే అవకాశం కల్పిస్తోందని ఆవేదన చెందారు.మిగిలిన వారు విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారని అన్నారు.పాకిస్తాన్‌ తప్ప అన్ని దేశాలకు విద్య కోసం వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు.మన దేశంలో ఏడాదికి ఒక కాలేజీలో రెండు వందల యాబై మందికి పరిమితం చేస్తున్నారని, యూకేలో ఈ సంఖ్య నాలుగు వందలు,  చైనాలో ఆరు వందల మందిని అనుమతిస్తున్నారని తెలిపారు.ఈ సందర్భంగా విప్రో గ్లోబల్‌ హెడ్‌ సంజీవ్‌ జైన్‌ మాట్లాడుతూ ప్రతి విద్యార్ది కష్టం తో కాక ఇష్టం తో చదవాలని అన్నారు.కేవలం ఉద్యోగం కోసంమే విద్య కాదని,సొంత పరిశ్రమల దిశగా అడుగులు వేయాలని చెప్పారు. ఈ స్నాతకోత్సవంలో 65మందికి గోల్డ్‌ మెడల్స్‌ అందజేశారు.ఇంకా యూజీ, పీజీకి చెందిన 8,619 మంది పట్టభద్రులకు పట్టాలను అందజేశారు.మరో 278 మంది రీసెర్చి గ్రాడ్యుయేట్లకు పట్టాలను అందజేశారు.స్నాతకో త్సవం సందర్భంగా యూనివర్సిటీ ప్రాంగణం అంతా విద్యార్థులు వారి తల్లిదండ్రుల సందడితో కోలాహలంగా కనిపించింది.పట్టాలు పొందిన వారంతా తమ మిత్రులతో కలసి ఫోటోలతో దిగుతూ కనిపించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు