విజయవాడఆగష్టు 8, (ఇయ్యాల తెలంగాణ ):విద్యుత్ ఉద్యోగుల సంఘాల జేఏసీ నాయకులు మంగళవారం నాడు చలో విద్యుత్ సౌధ, మహాధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఎటువంటి పోలీసుల అనుమతి కూడా లేదని ఎవరైనా ఉద్యోగులు నిబంధనలు అతిక్రమిస్తే ఏస్మా చట్టం కూడా ప్రయోగిస్తామనినగర పోలీసు కమిషనర్ హెచ్చరించారు. దాంతో విజయవాడ నగరంలో 144 సీఆర్పీసీ సెక్షన్ అమలులో ఉందన్నారు.
సోమవారం రాత్రి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ధర్నా కార్యక్రమాన్ని ఆగస్టు ఎనిమిదో తారీకు విరమించుకున్నామని, వర్క్ టూ రూల్ ఉద్యోగస్తులు అందరూ కూడా పాటించాలని పిలుపునిచ్చారు. అయితే ముందస్తు చర్యలలో భాగంగా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో విద్యుత్ సౌధ ప్రాంతమంతా మంగళవారం ఉదయం నుంచి పోలీసుల నిఘా నీడలోనే కొనసాగుతోంది