Ticker

6/recent/ticker-posts

Ad Code

నాటు తుపాకీ మిస్‌ ఫైర్‌ చిన్నారి మృతి

 

కాకినాడ ఆగష్టు 15, (ఇయ్యాల తెలంగాణ ):కాకినాడ తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో స్వతంత్ర దినోత్సవం రోజు విషాదం చోటు చేసుకుంది. తోటల్లో అడవి పందులు వేటాడేందుకు లోడ్‌ చేసి ఉన్న నాటు తుపాకీ మిస్‌ ఫైర్‌ అయి ధన్యశ్రీ (4) ఛాతీ లోకి దూసుకెళ్లి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి విగత జీవిగా పడి ఉండటంతో తల్లి తండ్రులు బోరున విలపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతికి కారకుడైన వ్యక్తిని అదుపులో తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు