హైదరాబాద్, ఆగష్టు 06 (ఇయ్యాల తెలంగాణ) : ప్రజా గాయకుడు, విప్లవ గీతాల ఉద్యమ గళం గద్దర్ (74) చికిత్స పొందుతూ మృతి చెందారు. గుండెకు చికిత్స కోసం గద్దర్ ఇటీవలే ధరమ్ కరమ్ రోడ్ అపోలో ఆసుపత్రిలో చేరారు. గత కొంత కాలంగా వివిధ పార్టీలతో అనేక మంతనాలు జరిపి భవిష్యత్ ప్రణాళికను ప్రకటించిన గద్దర్ అకాలంగా మరణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ ఆయన అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు. 1997 వ సంవత్సరంలో ఉద్యమాల సమయంలో తుపాకీ బుల్లెట్లు ఆయనకు గుండెల్లో దిగినా ఏ మాత్రం చెక్కు చెదరని విప్లవ చైతన్య ప్రజా గాయకుడు గద్దర్ మృతిపై అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత
ఆదివారం, ఆగస్టు 06, 2023
0
Tags