ముంబాయి ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ );మహారాష్ట్రలోని పూణేలో భారీ ఎత్తున మాదక ద్రవ్యం పట్టుపడిరది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డిఆర్ఐ ) దాడుల్లో ఐదుగురు నిందితులు దొరికిపోయారు. ఈ దాడులు శుక్రవారం రాత్రి జరిగాయి. నిందితులనుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.51 కోట్లు వుంటుంది. దాదాపు 101 కేజీల మెథాక్వాలోన్ను డీఆర్ఐ సీజ్ చేసింది. నిందితులు డ్రగ్స్ తో సహ హైదరాబాద్ నుంచి పుణే కు వెళుతున్నప్పుడు డిఆర్ఐ కు సమాచారం అందింది. నిందితుల్లో తెలంగాణ, మహారాష్ట్ర, ఢల్లీి, హర్యానాకు చెందినవారు వున్నారు. పట్టుబడ్డ నిందితులు డ్రగ్స్‌ను వివిధ రాష్ట్రాలలో విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. తెలంగాణలో డ్రగ్స్ తయారీ కేంద్రం వున్నట్లు అధికారులు గుర్తించారు.
పూణేలో డ్రగ్ మాఫియా గుట్టు రట్టు:ఐదుగురు నిందితుల అరెస్టు
శనివారం, ఆగస్టు 26, 2023
0
Tags