Ticker

6/recent/ticker-posts

Ad Code

పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం BJP పోరుబాట



   👉   కార్యాచరణను ప్రకటించిన తెలంగాణ బీజేపీ

   👉  16,17 తేదీల్లో బస్తీల సమస్యలపై ‘‘బస్తీల బాట’’

  👉 18న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఇవ్వాలని మండల కేంద్రాల్లో ధర్నాలు

  👉సెప్టెంబర్‌ 4న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల సమస్యపై హైదరాబాద్‌లో విశ్వరూప ధర్నా

  👉     బీజేపీ రాష్ట్ర అద్యక్షులు  కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ ఆగష్టు 12 (ఇయ్యాల తెలంగాణ) :  పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం బీజేపీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా శనివారం తెలంగాణ బీజేపీ కార్యాచరణను ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లపై ఉద్యమం చేపడతామని అన్నారు. ఈ నెల 16,17 తేదీల్లో బస్తీల సమస్యలపై ‘‘బస్తీల బాట’’ చేపడతామని.. బస్తీ, పేద ప్రజలను కలిసి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 18న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే 23, 24 తేదీల్లో అన్ని జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తామని, వచ్చే నెల 4న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల సమస్యపై హైదరాబాద్‌లో విశ్వరూప ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడిరచారు. సీఎం కేసీఆర్‌ కండ్లు తెరిపించే విధంగా ధర్నా ఉంటుందన్నారు. ఇండ్లు ఇస్తారా.. గద్దె దిగుతారా అని టీఆర్‌ఎస్‌ నాయకులను ప్రశ్నించాలని.. నిలదీయాలని నేతలకు పిలునిచ్చారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం రజాకార్ల ప్రభుత్వమని పేద ప్రజలంతా బీజేపీతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఫామ్‌ హౌస్‌లో, ప్రగతి భవన్‌లో నిద్ర పోతున్నది కేసీఆర్‌ ప్రభుత్వమని విరుచుకుపడ్డారు. వరదలొచ్చిన సీఎం కేసీఆర్‌ బయటకు రారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు