Ticker

6/recent/ticker-posts

Ad Code

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి BJP పట్టణాధ్యక్షులు దాసరి రాజశేఖర్‌

కోరుట్ల ఆగష్టు 19, ఇయ్యాల తెలంగాణ; టిఆర్‌ఎస్‌  ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలని కోరుట్ల బీజేపీపట్టణాధ్యక్షుడు దాసరి రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు..బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారంబీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం 2014 ,2018 ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు  ఇప్పటి వరకు నెరవేర్చడం లేదని, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కానీ రేషన్‌ కార్డులు బీసీ బందు లక్ష రూపాయలు ఇప్పటి వరకు ఏ ఒక్క లబ్ధిదారులకుఇచ్చిన దాఖలు లేవని ఆన్నారు..అలాగే పట్టణంలోని మినీ ట్యాంక్‌ బండ్‌ ప్రారంభానికి నోచుకోకుండా నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అర్హులైన బీసీ లందరికీ బీసీ బందు ఇవ్వాలని బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్‌ చేశారు. గత కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లన్నీ వెంటనేమరమ్మత్తు చేపట్టాలన్నారు.వరద బాధితులకు ఇప్పటి వరకు ఎలాంటి తక్షణ సాయం చేయకపోవడం శోచనీయమన్నారు..అధికార పార్టీ కౌన్సిలర్లకు ఒక విధంగా ప్రతిపక్ష కౌన్సిలర్లకు ఒక విధంగా బడ్జెట్‌ కేటాయించడం పై నిరసన తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హావిూలను వెంటనే నెరవేర్చాలని లేని పక్షణ మును ముందు నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామన్నారు.. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను మంచిస్తోందన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని గెలిచాక ఆ ఊసే లేదన్నారు.. లిక్కర్‌ టెండర్ల కోసం మాత్రం 15 రోజుల గడువిచ్చి, పేద ప్రజల ఇచ్చే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కోసం మాత్రం కేవలం మూడు రోజుల గడువు ఇవ్వడం చాలా బాధాకరమన్నారు.. ఈ కార్యక్రమంలో బీజేపీ కోరుట్ల, మెట్‌ పల్లి పట్టణాధ్యక్షులు దాసరి రాజశేఖర్‌,బడ్ల రమేష్‌, బీజేవైఎం పట్టణాధ్యక్షులు కలాల సాయిచంద్‌, నాయకురాలు జంగిలి సునీత, నాయకులు శీలం వేణుగోపాల్‌,  సుదవేణి మహేష్‌ ,సర్పంచ్‌ తుక్కారాం గౌడ్‌, కౌన్సిలర్లు పెండం గణేష్‌ ,మాడవేణి నరేష్‌, యాదగిరి బాబు ,డి.నవీన్‌ సత్యనారాయణ గౌడ్‌, పంచరి విజయ్‌, రాజు పాల్‌, తిరుమల వాసు, పీసరి నర్సయ్య, పోతుగంటి శ్రీనివాస్‌, మోలుమూరి రాజ మురళి బింగి వెంకటేష్‌, ఆకుల రంజిత్‌ మాసం ప్రసాద్‌ ,బీజేవైఎం నాయకులు నరేందర్‌, రాజేందర్‌, గంగాధర్‌ ,రంజిత్‌ రావు, సాగర్‌ ,నగేష్‌ ,అశోక్‌, శ్రావణ్‌ పాల్గొన్నారు..


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు