Ticker

6/recent/ticker-posts

Ad Code

చంద్రుడి పై ల్యాండరింగ్ కు పోటిపడుతున్నBHARAT RUSSIA

   

న్యూఢల్లీ ఆగష్టు 19. ఇయ్యాల తెలంగాణ; చంద్రయాన్‌`3, లూనా`25 మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొన్నది. ఈ రెండిరటిలో ఏది ముందు చంద్రుడిపై ల్యాండ్‌ అవుతుందనే అంశం సర్వత్రా ఆసక్తిగా మారింది. చంద్రయాన్‌`3 ఆగస్టు 23న ల్యాండ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది. అయితే రష్యా అంతరిక్ష కేంద్రం మాత్రం లూనా`25 ల్యాండిరగ్‌పై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

వెలుతురు ఆధారంగా ల్యాండిరగ్‌;చంద్రుడిపై ల్యాండరింగ్ వెలుతురు ఎంతో ముఖ్యం. చంద్రుడి ఉపరితలంపై ఆగస్టు 23న పగలు మొదలవుతుంది. ఇస్రో అదే రోజు ల్యాండిరగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నది. కానీ రష్యా మాత్రం ఆగస్టు 21`23 మధ్య ఏ రోజు అనేది స్పష్టంగా చెప్పడం లేదు. వెలుతురును దృష్టిలో ఉంచుకొని చూస్తే రెండూ స్వల్ప సమయం తేడాతో ల్యాండ్‌ అయ్యే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

బరువే చంద్రయాన్‌కు ప్రతికూలం;చంద్రయాన్‌`3 సుమారు 40 రోజుల ప్రయాణం తర్వాత చంద్రుడిపై కాలు మోపనున్నది. కానీ లూనా`25 మాత్రం 11 రోజుల వ్యవధిలోనే చంద్రుడ్ని చేరుకునే అవకాశం ఉన్నది. సామర్థ్యంలో ఉన్న తేడానే దీనికి కారణంగా తెలుస్తున్నది. తక్కువ బరువు, అధిక ఇంధన సామర్థ్యం ఉన్న కారణంగా లూనా`25 వేగంగా చంద్రుడిని చేరుకుంటున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 3900 కిలోలు ఉండటం కూడా చంద్రయాన్‌`3కి ప్రతికూలంగా మారింది. లూనా`25 బరువు కేవలం 1750 కిలోలు. చంద్రుడిపైకి చేరుకున్న తర్వాత చంద్రయాన్‌`3కి సంబంధించిన రోవర్‌ 14 రోజులు పరిశోధనలు జరపనుండగా, లూనా`25 మాత్రం ఏడాది పాటు పని చేయనున్నది.

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు