ప్రజావాణిలో అర్జీలు సమర్పించిన ANMలు
ప్రభుత్వం స్పందించకుంటే 16 నుండి సమ్మెలోకి వెళ్తాం
ఏఎన్ఎం ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధురిమ
జగిత్యాల,ఆగష్టు 07 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో గత 15 సంవత్సరాల నుండి నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న 4500 మంది రెండవ ఏఎన్ఎం లను ఏలాంటి వ్రాత పరీక్షలు లేకుండా బెషరత్ గా రెగ్యులర్ చేయాలని ఏఐటియూసీ కి అనుబంధంగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర సెకండ్ ఏఎన్ఎంల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాండ్ల మధురిమ ప్రభుత్వాన్ని కోరారు.సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లాలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన ఏఎన్ఎం లతో కలిసి మధురిమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుండడం పట్ల నిరసన తెలిపారు.ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి విక్షత గురవుతున్న సెకండ్ ఏఎన్ఎం లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.అనంతరం గాండ్ల మధురిమ ఆధ్వర్యంలో రెండవ ఏఎన్ఎంలను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కు ఏఎన్ఎంలు వినతిపత్రాలు సమర్పించారు.ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి రెండవ ఏఎన్ఎం లందరినీ బేషరతుగా రెగ్యులర్ చేస్తున్నట్లు ఈనెల 15 లోపు ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాలని లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి సమ్మెలోకి వెళ్తామని మధురిమ తెల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో రెండవ ఏఎన్ఎంల సంఘం జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల మమత, పద్మ, స్వరూప, జి. శైలజ, పి.శిరీష, నీరజ, సౌజన్య, మధులత, వసంత, ఎలిజబెత్ రాణి, సుమలత, సరోజ, చిలుకమ్మ, రాజమణి, మహేశ్వరి, శంకరమ్మ, సునీత, శిరీష, గణిత, జమున తదితరులు పాల్గొన్నారు.