నెవ2 డిల్లీ ఆగష్టు 19,
ఇయ్యాల తెలంగాణ; గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడిరచిన కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉంది. భారత్ లో రోజూవారి కొత్త కేసుల్లో పెరుగుదల లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. దీంతో ప్రజలు సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో కరోనా కొత్త వేరియంట్లు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఈజీ. 5 వేరియంట్ అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో వెలుగులోకి రాగా.. తాజాగా అమెరికాలో మరోకొత్త వేరియంట్‌ను అధికారులు గుర్తించారు.కొవిడ్ 19కి చెందిన అత్యంత పరివర్తన చెందిన కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు అమెరికాకు చెందిన వ్యాధి నియంత్రణ కేంద్రం తెలిపింది. ఈ వేరియంట్‌కు బీఏ.2.86 (ఃం.2.86)గా పేరు పెట్టినట్లు పేర్కొంది. ఈ కొత్త వేరియంట్ అమెరికాతోపాటు ఇజ్రాయెల్, డెన్మార్క్ దేశాల్లో కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది.కొవిడ్`19కి చెందిన కొత్త వేరియంట్‌ను కనుగొన్నాం. దీనికి బీఏ.2.86 అని పేరు పెట్టాం. ఈ కొత్త వైరస్ యునైటెడ్ స్టేట్స్, డెన్మార్క్, ఇజ్రాయెల్‌లో కనుగొనబడిరది. కొత్త వేరియంట్‌కు చెందిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నాం’ అని అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం తెలిపింది.మరోవైపు కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (చిఊూ) కూడా స్పందించింది. బీఏ.2.86 అధిక సంఖ్యలో ఉత్పరివర్తనలు కలిగి ఉన్నందున దానిని ‘పర్యవేక్షణలో ఉన్న వేరియంట్’ గా పేర్కొన్నట్లు తెలిపింది. ఈ రకానికి చెందిన సీక్వెన్స్‌లు కొన్ని దేశాల్లో వెలుగు చూసినట్లు వెల్లడిరచింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం.. కొవిడ్`19 (అనీలతిట`19)కి కారణమయ్యే వైరస్ ూంఖీూ`అనీప`2తో సహా అన్ని వైరస్‌లు కాలక్రమేణా మారుతూ ఉంటాయి. అయితే, ఆ మార్పులు వైరస్ లక్షణాలపై ఎలాంటి ప్రభావం చూపవు. అయినప్పటికీ, వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుంది, వ్యాధి తీవ్రత, వ్యాక్సిన్‌లు, చికిత్సా ఔషధాల పనితీరు వంటి కొన్ని మార్పులు వైరస్ లక్షణాలను ప్రభావితం చేయొచ్చు.
0 కామెంట్‌లు