తిరుపతి, ఆగస్టు 11, (ఇయ్యాల తెలంగాణ ):వినియోగదారులను ఠారెత్తించి రైతుల పంట పండిరచిన టమోటా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌యార్డులో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి.` గత నాలుగు రోజులుగా మార్కెట్‌కు దిగుబడి స్వల్పంగా పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం వరకు అత్యధికంగా కిలో టమాటా రూ.100 వరకు ఉంది. గురువారం ఈ ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ఏ గ్రేడ్ కిలో టమాటా రూ.50 నుంచి రూ.64 వరకు అమ్ముతున్నారు. తక్కువ గ్రేడ్ టమాటాలు ఇంకా తక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా టమాటా ధరలు తగ్గు ముఖంపట్టాయి. దేశ రాజధాని ఢల్లీిలోని మండీల్లో కిలో రూ.యాభైకే అమ్ముకున్నారు. గత వారం వరకు ఢల్లీిలో టమాట కిలో రూ.180 నుంచి 200 వరకు విక్రయించారు. టమాటా ధర రూ.50తగ్గడంతో ఒక్కసారిగా మార్కెట్‌లో టమాట కొనుగోలుదారుల సంఖ్య పెరిగింది. టమాటా ధరలు తగ్గడానికి కారణం ప్రస్తుతం వర్షం తగ్గడమేనని భావిస్తున్నారు. అందుకే హిమాచల్‌ప్రదేశ్ నుంచి రోజూ సరిపడా టమాటాలు సరఫరా అవుతున్నాయి. కర్నాటకలోనూ వర్షాలు ఆగిపోయాయి. దీంతో బెంగళూరు నుంచి కూడా టమాటా మండీలకు చేరుతోంది. టమాట రాక రాను రాను పెరగడంతో రూ.5కి తగ్గింది. టమోటా ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో కేంద్రం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ ధరలకు టమోటా అమ్మకాలకు ప్రయత్నించారు. కానీ, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కౌంటర్లు సామాన్యులను ఏ మాత్రం సరిపోలేదు.వర్షాలు తగ్గటం, మార్కెట్ కు పెద్ద మొత్తంలో టమోటా రావటంతో ధరలు తగ్గు ముఖం పట్టాయి. హైదరాబాద్‌కు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచే అధికంగా టమాట వస్తోంది.
తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని జిల్లాల నుంచి కూడా టమాట ఎక్కువగానే వస్తోంది.ఇటీవలి కాలంలో టమాటా ధరలు కొండెక్కడంతో.. రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కొందరు రైతులైతే ఎప్పడూ లేని స్థాయిలో టమాటా ధరలు పెరగడంతో కోటీశ్వరులు కూడా అయ్యారు. ఒకానొక సందర్భంలో రూ.1, రూ. 2లు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. కనీస పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో తమ పంటను రోడ్డువిూదే పారబోయడం కూడా చూశాం. అలాంటిది ఈ సారి ఇంత ధర పలకడంతో రైతులు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం ఈ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతాయని కూడా అంచనా వేస్తున్నారు. దీంతో మళ్లీ ఆందోళన మొదలైందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
0 కామెంట్‌లు