Ticker

6/recent/ticker-posts

Ad Code

2nd భార్య కోసం - 1st భార్య హత్య


మెదక్‌,   ఆగస్టు 11 ఇయ్యాల తెలంగాణ :  మెదక్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రెండో భార్య మోజులో పడిన భర్త మొదటి భార్యను కడతేర్చిన ఘటన సంచలనంగా మారింది. మెదక్‌ (మం) తిమ్మక్కపల్లి తండాలో రమేష్‌ స్వరూపకి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్ది రోజులు ఆనందంగా వున్న వీరి జీవితంలో అక్రమ సంబంధం అనే భూతం వీరిద్దరిని గొడవలకు దారితీసింది. భర్త వేరే స్త్రీ మోజులో పడి భార్యతో గొడవలకు దిగాడు. ఈ గొడవలు కాస్తా చిలికి చిలికి గాలివానై భర్త రెండో పెళ్లికి సిద్దమయ్యేలా దారులు తీసాయి. రమేష్‌, స్వరూపకి పదేళ్ల క్రితం వివాహమైన భర్త రమేష్‌ ఇటీవల మరో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి తర్వాత రమేష్‌, స్వరూప మధ్య తరచు గొడవలు జరిగేవి. దీంతో రమేష్‌, మొదటి భార్య స్వరూపపై కోపంతో ఊగిపోయాడు. ఆమెను ఎలాగైనా వదిలించుకుని రెండో భార్యతో గడపాలని ప్లాన్‌ వేసుకున్నాడు. ఈ నెల 6న పొలం పనుల కోసమని స్వరూపని బావి దగ్గరకు తీసుకెళ్లాడు. బావి దగ్గరకు ఎందుకు తీసుకు వచ్చావు అని అడగగా మాట మాట కలిపాడు. ఏవిూ లేదంటూ అక్కడే ప్లాన్‌ ప్రకారం పురుగుల మందు డబ్బాను చేతిలో తీసుకున్నాడు. భయంతో స్వరూప అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నించింది. అయితే స్వరూపను రమేష్‌ గట్టిగా పట్టుకుని బలవంతంగా పురుగుల మందు తాగించాడు.వద్దని వదిలేయాలని బ్రతిమలాడినా అస్సలు చెవిన వేసుకోలేదు. ప్రాధేయ పడ్డా పరుగుల మందు ఆమె నోట్లో వేశాడు. దీంతో స్వరూప కడుపు మంటతో కిందపడి విల విల లాడుతూ ప్రాణాలతో కొట్టుకుంది. అయితే.. రమేష్‌ చాకచక్యంగా స్వరూప తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిందని నమ్మించాడు. ఆమెను ఏవిూ తెలియనట్లు ఆసుపత్రికి తీసుకువెళ్లి పురుగుల మందు తాగిందని వెంటనే చికిత్స చేయాలని నటించాడు. ఈ నెల 9న సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్వరూప మృతి చెందింది. స్వరూప తనంతకు తాను పురుగుల మందు తాగలేదని తల్లితండ్రులు గ్రహించారు. భర్త రమేష్‌ ఆమెను బలవంతంగా తాగించడంతోనే తన కూతురు మృతి చెందిందని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. గ్రామంలో పోలీసుల పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. రమేష్‌ ను అదుపులో తీసుకున్నారు. రెండో భార్యను కూడా అదుపులో తీసుకుంటామని తెలిపారు. మొదటి భార్య వుండగానే రెండో పెళ్లి చేసుకున్నా రమేష్‌, రెండో భార్యను కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు