బెంగుళూరు ఆగష్టు 26 (ఇయ్యాల తెలంగాణ ): చంద్రయాన్`3 మిషన్‌ను అత్యంత విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలను ఇవాళ ప్రధాని మోదీ కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 23వ తేదీని ఇక నుంచి జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇక చంద్రయాన్`3కి చెందిన విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని శివశక్తిగా నామకరణం చేస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడిరచారు. బెంగుళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్‌లో శాస్త్రవేత్తలను మోదీ కలిశారు. చంద్రుడిపై చంద్రయాన్`2 జ్ఞాపకాలను వదిలి వెళ్లిన ప్రాంతాన్ని తిరంగాగా నామకరణం చేస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడిరచారు. భారత్ సాగించిన ప్రతి ప్రయత్నానికి ఇస్రో స్పూర్తిగా నిలుస్తుందన్నారు. విఫలమనేది అన్నింటికీ అంతం కాదు అన్న సత్యాన్ని గుర్తు చేస్తుందన్నారు.
చంద్రయాన్`3 విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని శివశక్తిగా నామకరణం