Ticker

6/recent/ticker-posts

Ad Code

ఎన్నికల్లో టెక్నాలజీ... నిఘా కోసం 20 యాప్‌ లు


హైదరాబాద్‌, ఆగస్టు 14, (ఇయ్యాల తెలంగాణ ):త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) టెక్నాలజీని వాడడానికి కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ సన్నద్ధమవుతున్నది.ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ ఇప్పటికే 20 రకాల మొబైల్‌ యాప్‌లను కమిషన్‌ రూపొందించింది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్‌ టైమ్‌ ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ను వినియోగించింది. దీనికి కొనసాగింపుగా తెలంగాణలో సైతం ఏఐ టూల్స్‌ సహాయంతో మరికొన్ని అంశాల్లో విస్తృతంగా వాడాలనుకుంటున్నది.అభ్యర్థులు చేసే ఖర్చు, ఓటర్లను ప్రలోభపెట్టడం వరకు అన్నింటిపైనా నిఘా కొనసాగించడం ఏఐ వినియోగం ప్రధాన లక్ష్యం. ప్రతీ నిమిషం వారి కదలికలను ఏఐ టూల్స్‌ విశ్లేషిస్తాయి.  అభ్యర్థులు నామినేషన్లలో అందించే సమాచారాన్ని క్రోడీకరించి ఏఐ టూల్స్‌ ద్వారా సమగ్రమైన డేటాను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిర్దిష్టంగా ఎలాంటి యాక్టివిటీస్‌కు ఏఐ టెక్నాలజీని వాడనున్నది కమిషన్‌ బహిర్గతం చేయలేదు.కానీ వీలైనంత బెస్ట్‌ రిజల్టు రాబట్టేలా రీసెర్చ్‌ జరుగుతున్నది. ఓటర్లకు అవగాహన కల్పించడం, సౌకర్యాలను అందుబాటులోకి తేవడం మొదలు అభ్యర్థులు మద్యం, మనీ ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడాన్ని కట్టడి చేయడం, ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించడం, అవకతవకలను నివారించడం వరకు ఈ పరిజ్ఞానాన్ని వినియోగించనున్నది.క్షేత్రస్థాయిలో పరిశీలకుల పేరుతో ఐఏఎస్‌ అధికారులు మొదలు ప్రభుత్వ సిబ్బంది వరకు పనిచేస్తున్నా టెక్నాలజీని సమర్థవంతంగా వాడాలని కమిషన్‌ భావిస్తున్నది.ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహా ఆధునిక పరిజ్ఞానాన్ని వాడడం కోసం ప్రత్యేకంగా ఢల్లీిలోని ద్వారక ప్రాంతంలో ఐఐఐడీఈఎం(ఇండియా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెమొక్రసీ అండ్‌ ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌) అనే విభాగాన్ని ఎలక్షన్‌ కమిషన్‌ ప్రత్యేకంగా నెలకొల్పింది. ఎన్నికల నిర్వహణలో ఏఐ టూల్స్‌ వినియోగంపై ఈ విభాగం రీసెర్చ్‌ చేస్తోంది. దాన్ని వినియోగించడానికి ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇస్తుంది. దాదాపు పన్నెండేళ్ల క్రితమే ఈ విభాగానికి అంకురార్పణ జరిగినా మొబైల్‌ యాప్‌ల తయారీ వరకు అది సక్సెస్‌ఫుల్‌గా నడిచిందనేది కమిషన్‌ భావన.కానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో దీనికి మరింత పదును పెట్టి ఏఐ టూల్స్‌ వినియోగిస్తూ ‘కెపాసిటీ బిల్డింగ్‌’ యూనిట్‌గా మలచాలనుకుంటున్నది. ఈ విభాగం ఇంతకాలం నిర్వాచన్‌ సదన్‌లోనే పనిచేసింది. కానీ ఇకపైన స్వతంత్రంగా పనిచేయడానికి ద్వారకలో ప్రత్యేక భవనంలోకి షిప్ట్‌ అయింది. ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ జూన్‌లో ఈ విభాగాన్ని లాంఛనంగా ప్రారంభించారు.ఎన్నికల నిర్వహణ కోసం మార్గదర్శకాలను రూపొందించడం మొదలు సిబ్బంది నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించడం, అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లలో వివరాలను విశ్లేషించి నిర్దిష్ట ఫార్మాట్‌లో డేటాను నిక్షిప్తం చేయడం, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే గుర్తించడం తదితరాలన్నింటికీ దీన్ని వాడనున్నట్లు పరోక్షంగా వ్యాఖ్యానించారు.అభ్యర్థులు నామినేషన్‌ పత్రాల్లో పొందుపరిచే ఫోన్‌ నంబర్‌, పాన్‌కార్డు, ఆధార్‌ కార్డు లాంటి వివరాలను ఏఐ టూల్స్‌ ద్వారా కమిషన్‌ సమర్థవంతంగా వాడుకోనున్నది. వాటి ఆధారంగానే అభ్యర్థుల కదలికలు, రోజువారీ ఎలక్షన్‌ ఖర్చు, బ్యాంకు లావాదేవీలు, సోషల్‌ విూడియాలో పెట్టే పోస్టులు, ఓటర్లను ప్రలోభపెట్టడానికి వాడే విధానాలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు.. వీటిపై 24 గంటలూ ఏఐ టూల్స్‌ సాయంతో ఏర్పడే ప్రత్యేక వ్యవస్థ నిఘా వేస్తుంది.
అభ్యర్థుల నుంచి అనుచరులు, కార్యకర్తలు, ఏజెంట్లకు వెళ్లే ఆదేశాలు, సోషల్‌ విూడియా ప్రచారం, ఓటర్లను ఆకర్షించడానికి చేసే అనైతిక చర్యలన్నింటిపైనా మూడో కంటికి తెలియకుండా ఏఐ టూల్స్‌ ఆధారంగా ఏర్పడే సర్వియలెన్స్‌ మెకానిజం ఎప్పటిప్పుడు క్రోడీకరిస్తుంది.ఎన్నికల్లో విస్తృతంగా మద్యం, మనీ వినియోగం జరుగుతున్నా నియంత్రించడంలో కమిషన్‌ విఫలమవుతున్నదనే నిందలు వస్తున్నాయి. దీనికి చెక్‌ పెట్టడానికి కమిషన్‌ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏఐ టూల్స్‌ను విస్తృతంగా వినియోగించి కట్టడి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప స్థాయిలో వాడిన ఏఐ టెక్నాలజీ ఇచ్చిన ఫలితాలను కమిషన్‌ ఇప్పటికే అనలైజ్‌ చేసింది. తెలంగాణ నుంచి వెళ్లిన ఆరుగురు ఎన్నికల అధికారులు సైతం సమర్థవంతంగా జరిగిన ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌పై అధ్యయనం చేశారు. అక్కడి బెస్ట్‌ ప్రాక్టీసుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇకపైన ఐఐఐడీఈఎం నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా ఏఐ టూల్స్‌ వినియోగం జరగనున్నది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు