Ticker

6/recent/ticker-posts

Ad Code

గ్రూప్‌`2’ పరీక్షపై August 14న నిర్ణయం,


హైదరాబాద్‌, ఆగస్టు 12, (ఇయ్యాల తెలంగాణ) : గ్రూప్‌`2 పరీక్ష వాయిదా కోరుతూ 150 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిగింది. రాష్ట్రంలో ఇతర పరీక్షల నేపథ్యంలో గ్రూప్‌`2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు కోర్టును కోరగా.. ఇప్పటికే పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ తరుణంలో వాయిదా కష్టమని టీఎస్‌పీఎస్సీ కౌన్సిల్‌ తమ వాదనలు హైకోర్టు ముందు వినిపించింది. అయితే, గ్రూప్‌`2 పరీక్ష నిర్వాహణపై సోమవారం(ఆగష్టు 14) స్పష్టమైన ప్రకటన చేస్తామని టీఎస్‌పీఎస్సీ కౌన్సిల్‌ హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో కచ్చితంగా ఆ తేదీ తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ.. ఆగస్టు 14కి విచారణ వాయిదా వేసింది కోర్టు.ప్రకటించిన షెడ్యూలు ప్రకారం తెలంగాణలో ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌`2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే, గ్రూప్‌`2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు ఆగస్టు 10న హైకోర్టును ఆశ్రయించారు. గురుకుల టీచర్‌ పోస్టులతో పాటు పాలిటెక్నిక్‌ జూనియర్‌ లెక్చర్ల పరీక్షల నేపథ్యంలో గ్రూప్‌`2 వాయిదా వేయాల్సిందిగా కోర్టును అభ్యర్ధించారు. అగస్టు 2 నుండి 30 వరకు రకరకాల పరీక్షలు జరగనున్నాయని, గ్రూప్‌`2 రాసే అభ్యర్థులు మిగిలిన పరీక్షలు కూడా రాస్తున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని పరీక్షల సిలబస్‌ వేరు, దీంతో అన్ని పరీక్షలకు ఒకే నెలలోనే ప్రిపేర్‌ అయి రాయడం సాధ్యం కాదు. మొత్తంలో 90 శాతం మంది అభ్యర్థులు గ్రూప్‌`2 పరీక్ష నిర్వయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు అని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్‌`2 పరీక్ష కోసం 5.5 లక్షలు మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ గురుకుల్‌ పరీక్ష కు 60 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే గ్రూప్‌`2 పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. 1,535 సెంటర్‌లను ఎంపిక చేశాం. పరీక్షలు జరిగే స్కూల్‌,కాలేజ్‌ లకు సెలవులు ప్రకటించాం. ఐదున్నర లక్షల మంది అభ్యర్థుల్లో.. పిటిషన్‌ వేసింది కేవలం 150 మంది మాత్రమే. అయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆగస్టు 14న స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. దీంతో పిటిషన్‌పై విచారణను ఆగస్టు 14కి వాయిదా వేసింది.


తెలంగాణలో గ్రూప్‌`2 పరీక్షపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఒకే నెలలో ముఖ్యమైన పరీక్షలను నిర్వహిస్తుండటంతో.. తమకు అన్యాయం జరుగుతోందని, గ్రూప్‌`2 పరీక్ష వాయిదావేయాలని కొందరు అభ్యర్థులు కోరుతుండగా.. ఒకే పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు మాత్రం పరీక్ష నిర్వహించాల్సిందే అని పట్టుబడుతున్నారు. దీంతో ఇరువర్గాలు విజ్ఞప్తులు చేస్తుండటంతో రాష్ట్రంలో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అయితే వీటిపై టీఎస్‌పీఎస్సీ మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు. గ్రూప్‌`2 వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ స్పందించింది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ అందుబాటులో లేనందున రెండురోజుల సమయం పడుతుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే గ్రూప్‌`2 పరీక్ష షెడ్యూలు ప్రకారమే ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. హైకోర్టుకు ‘గ్రూప్‌`2’ అభ్యర్థులు, పరీక్ష వాయిదా కోరుతూ పిటిషన్లుతెలంగాణలో ‘గ్రూప్‌`2’ పరీక్ష వాయిదా వేయాలని ఒకవైపు ధర్నాలు, నిరసనలు కొనసాగుతుండగానే.. మరోవైపు ‘గ్రూప్‌`2’ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆగస్టు 9, 30 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్‌`2 పరీక్ష వాయిదా వేయాలంటూ 150 మంది అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గురుకుల, ఇతర నియామక పరీక్షలు ఉన్నందున గ్రూప్‌`2ను రీషెడ్యూల్‌ చేయాలని పిటిషన్‌లో కోరారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు