Ticker

6/recent/ticker-posts

Ad Code

15th August - శతాబ్దాల పోరాటం, త్యాగం, అచంచలమైన సంకల్పం

పంద్రాగస్టు.. భారత దేశం పరాయి పాలననుంచి స్వాతంత్య్రం పొందిన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకునే రోజు.. 1947లో బ్రిటీష్‌ వలస పాలన నుంచి భారతదేశం విముక్తి పొందిన తర్వాత ప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ మహత్తర సందర్భం శతాబ్దాల పోరాటం, త్యాగం, అచంచలమైన సంకల్పానికి ముగింపు పలికింది. దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయుల అలుపెరగని పోరాటం, ప్రాణత్యాగం ఫలితంగా స్వాతంత్రం సిద్దించిన రోజును మనం పండుగలా జరుపుకుంటున్నాం.దేశం సాధించిన విజయాలను ప్రతిబింబిస్తూ.. నిరంతర ప్రగతి ఆవశ్యకతను నొక్కి తెలియజేస్తారు. స్వాతంత్య్ర దినోత్సవం అనేది గతానికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు.. దేశం ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురుచూసే అవకాశం.. ఇది భారత దేశానికి ఆధారమైన భిన్నత్వంలో ఏకత్వం,  ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేస్తుంది.స్వాతంత్య్ర దినోత్సవం యొక్క థీమ్‌  నేషన్‌ ఫస్ట్‌.. ఆల్వేస్‌ ఫస్ట్‌.. ఈ థీమ్‌ కష్ట సమయాల్లో కూడా దేశ ప్రయోజనాలకు మొదటి స్థానం ఇవ్వాలనే ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని ప్రభుత్వం తెలిపింది.పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో ఈ రోజు ప్రారంభమవుతుంది.. ఆ తర్వాత దేశభక్తి గీతాలు పాడటం, సాంస్కృతిక ప్రదర్శనలు జాతీయ భావం నింపుతాయి. ఢిల్లీ లోని చారిత్రాత్మక ఎర్రకోట నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగింస్తారు. రోజంతా భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం, వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు, కవాతులు జరుగుతాయి.  ప్రజలంతా జెండా పండుగలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పిస్తారు. దేశం పట్ల తమకున్న ప్రేమను చాటుకుంటారు.


 అంతేకాదు.. దేశ ప్రగతి, ముందున్న సవాళ్లను ప్రజలు అంచనా వేసేందుకు ఈ రోజు ఒక సమయంగా ఉపయోగపడుతుంది. రాబోయే తరాలకు బలమైన, సమగ్రమైన, సంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే నిబద్ధతను పునరుద్దరించేందుకు స్వాతంత్య్ర దినోత్సవం ఓ మంచిరోజు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం: బ్రిటీష్‌ పాలన నుంచి దేశం స్వాతంత్య్రం పొందిన ఒక సంవత్సరం తర్వాత భారతదేశం మొదటి స్వాతంత్య్ర దినోత్సవాన్ని 1948 ఆగస్టు 15న జరుపుకున్న వాస్తవం ఆధారంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవంగా పరిగణించబడుతుంది. ఇది చాలా సాధారణమైన గణన పద్ధతి.  భారతదేశం 15 ఆగస్టు 1947న స్వాతంత్య్రం లభించిందనే వాస్తవం ఆధారంగా  ఈ లెక్కింపు విధానం రూపిందించబడంది. కాబట్టి 2023 అనేది 77వ స్వాతంత్య్ర దినోత్సవం. అయితే ఎక్కువగా 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్నే పరిగణనలోని తీసుకుంటున్నారు. మరో వైపుఆగస్టు 15 వస్తోందనగానే చాలా చోట్ల జాతీయ జెండా రంగుల్లో దుస్తులు అమ్ముతున్నారు. చాలామంది ఇష్టంగా కొనుక్కుని ధరించి దేశభక్తిని చాటుకుంటారు. ఇలా జాతీయ జెండా రంగుల్లో దుస్తులు ధరించడంలో తప్పు లేదు. అయితే దానికి సంబంధించిన కొన్ని నియమాలు మాత్రం పాటించాలి. దీనికి సంబంధించి 2005లో లోక్‌సభ ఒక బిల్లును ఆమోదించింది. భారతీయ పౌరులు గౌరవప్రదంగా ధరిస్తే వారి దుస్తులలో భాగంగా త్రివర్ణాన్ని ధరించవచ్చును అని పేర్కొంది. 


అయితే 2005లోని సెక్షన్‌ 2 (ఇ) ప్రకారం జాతీయ జెండాను ఎవరూ నడుము కింద్రి నుంచే ధరించే దుస్తుల్లో వాడరాదు. జాతీయ జెండాను ఎలాంటి డ్రెస్‌ మెటీరియల్‌ పైన ముద్రించకూడదు అని స్పష్టం చేసింది.చట్టం ప్రకారం నడుము క్రింద భాగంలో ఎవరూ త్రివర్ణ పతాకాన్ని ధరించకూడదు. కుషన్లు, రుమాలు మరియు లో దుస్తులు వంటి రోజువారి ఉపయోగంలో వాడరాదు. కోడ్‌ ను ఉల్లంఘిస్తే కనీసం సంవత్సరకాలం జైలు శిక్ష విధిస్తారు. మూడు రంగుల టీ షర్టు, చీర, దుపట్టా లేదా తలపాగా, చెవి పోగులు, బ్యాంగిల్స్‌ వంటి ఉపకరణాల్లో రంగులు చేర్చుకోవచ్చు. మరి జాతీయ జెండా రంగుల్లో బట్టలు ధరించేటప్పుడు మరి జాగ్రతలు తీసుకోండి..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు