హైదరాబాద్, ఆగస్టు 27 (ఇయ్యాల తెలంగాణ ):గాంధీభవన్‌కి అప్లికేషన్లు వెల్లువలా వచ్చిపడ్డాయి. పోటీకి మేము సిద్ధం అంటే మేము సిద్ధం అంటూ.. పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. సాధారణంగా ఒక నియోజకవర్గం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు పోటీ పడతారు. కానీ ఈసారి ఊహించని విధంగా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహుల నుంచి టీపీసీసీ దరఖాస్తులు స్వీకరించింది. ఈ నెల 18తో మొదలైన పక్రియ 25వ తేదీతో ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దరఖాస్తు చేసేందుకు ఆశావాహులు పోటీ పడ్డారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున 9,10 అప్లికేషన్స్ వచ్చాయి. అత్యధికంగా ఇల్లందు సెగ్మెంట్ కు ఎక్కువ దరఖాస్తు లు రాగా అత్యల్పంగా కొడంగల్ నియోజకవర్గానికి వచ్చాయి. గడువుతేదీ నాటికి మొత్తం 119 నియోజకవర్గాలకు గాను..1020 అప్లికేషన్లు వచ్చాయి. కొన్ని నియోజకవర్గాలకు సొంత కుటుంబ సభ్యులే ఇద్దరు, ముగ్గురు దరఖాస్తు చేసారు. నాగార్జున సాగర్ టిక్కెట్ కోసం జానారెడ్డి ఇద్దరు కొడుకులు రఘువీర్ రెడ్డి , జై వీర్ రెడ్డి దరఖాస్తు చేయగా, కరీంనగర్ నియోజకవర్గానికి కెసిఆర్ అన్న రంగారావు కూతురు రమ్యా రావు , ఆమె కొడుకు రితేష్ రావు దరఖాస్తు చేసుకున్నారు.ముషీరాబాద్ టిక్కెట్ కోసం తండ్రి అంజన్ కుమార్ యాజవ్ ,కొడుకు అనీల్ కుమార్ యాదవ్ పోటీ పడుతుండగా, ఆందోల్ సెగ్మెంట్ కోసం తండ్రి దామోదర రాజనర్సింహ, కూతురు త్రిశాల దరఖాస్తు ధాఖలు చేసారు.ఇలా ఓకే కుటుంబ సభ్యులు ఓకే నియోజకవర్గం కోసం అర్జీ పెట్టుకున్నారు.దరఖాస్తు పెట్టుకున్న ముఖ్యమైన వారిలో కొడంగల్ ? రేవంత్ రెడ్డి,మధిర ? భట్టి విక్రమార్క, హుజూర్ నగర్ ? ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ ? కోమటిరెడ్డి వెంకటరెడ్డి,జగిత్యాల ? జీవన్ రెడ్డి, కామారెడ్డి ? షబ్బీర్ అలీ, వరంగల్ తూర్పు ? కొండా సురేఖ, పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం ? పొంగులేటి శ్రీనివాసరెడ్డి,మంథని ? శ్రీధర్ బాబు, సంగారెడ్డి` జగ్గారెడ్డి, హుజూర్ నగర్` ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒప నగర్ ? మధు యాష్కీ, జనగాం` పొన్నాల లక్ష్మయ్య,ములుగు ? సీతక్క,వనపర్తి ? చిన్నారెడ్డి,తుంగతుర్తి ? అద్దంకి దయాకర్ ,మంచిర్యాల` ప్రేమ్ సాగర్ రావు, హుస్నాబాద్` పొన్నం ప్రభాకర్,కంటోన్మెంట్ `సర్వే సత్యనారాయణ మహాబూబాబాద్` బలరాం నాయక్ లు ఉన్నారు.. పోలీస్ చంద్రారెడ్డి,కొల్లాపూర్` అభిలాష్ రావు, కల్వకుర్తి ? రఘు సుంకిరెడ్డి, ఎల్లారెడ్డి` మదన్ మోహన్ రెడ్డి,ఆదిలాబాద్ `కంది శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల `మన్యం రాజశేఖర్ రెడ్డి లు అర్జీ పెట్టారు.కాంగ్రెస్ లో సీనియర్ నేతలు అయిన జానారెడ్డి, రేణుక చౌదరి, నాగం జనార్దన్ రెడ్డి, గీతారెడ్డి, వీహెచ్ లు ఏ సెగ్మెంట్ కోసం దరఖాస్తు చేయలేదు. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ హూస్నాబాద్ కు, మధుయాష్కీ ఎల్బీ నగర్ టిక్కెట్ల కోసం దరఖాస్తు పెట్టి అందరికీ షాకిచ్చారు. వచ్చిన దరఖాస్తులను సోమవారం రోజు టీపీసీసీ ఎలక్షన్ కమిటీ ముందు ఉంచనున్నారు. ఎలక్షన్ కమిటీ స్క్రూటిని చేసి స్కీనింగ్ కమిటీ కి అర్హులైన అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తుంది.ఆ తర్వాత అసలైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం. మొత్తం 119 నియెజకవర్గాల్లో1020 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు.
119 నియోజకవర్గాలకు 1020 దరఖాస్తులు
ఆదివారం, ఆగస్టు 27, 2023
0
Tags