Ticker

6/recent/ticker-posts

Ad Code

Telangana లో 2 రోజుల పాటు భారీ వర్షాలు -


హైదరాబాద్‌, జులై 19 (ఇయ్యాల తెలంగాణ) :  జార్ఖండ్‌ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ  నుంచి అతి భారీ స్థాయి వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ శాఖా ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా పడుతున్న ముసురుతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఒడిశాను ఆనుకొని ఉన్న జార్ఖండ్‌ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిరది. దీనికి అనుబంధంగా ఉప రితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధ,గురువారాల్లో అనేకచోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు పేర్కొంది. 

అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాలు : 

ఇయ్యాల తెలంగాణ / మన భాష - మన యాస / మన దినపత్రిక 


💧మహబూబాబాద్‌, వరంగల్‌,  హనుమకొండ, ఖమ్మం భారీ నుంచి అతిభారీ వర్షాలు 

💧 సిద్దిపేట, జనగాం, నిజామాబాద్‌, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు,         

     మెదక్‌, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్‌, యాదాద్రి భువనగిరి. భారీ వర్షాలు.. 

💧 ఆదిలాబాద్‌, కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, మెదక్‌, మేడ్చల్‌        మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి  మోస్తరు నుంచి భారీ వర్షాలు.. 

💧హైదరాబాద్‌ సహా చుట్టుపక్కల ప్రాంతాలు,  మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు       

     వర్షాలు కురుస్తాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు