పాలకొల్లు, జులై 20 (ఇయ్యాల తెలంగాణ) : పాలకొల్లు ఐఎంఏ హాలులో ప్రస్తుతం ఊపిరితిత్తులు లివర్ వ్యాధులపై హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ వైద్య నిపుణులు ప్రస్తుత ఆధునిక వైద్య విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఊపిరితిత్తులకు వచ్చే ఆస్మా వ్యాధి ,లివర్ వ్యాధులపై తీసుకోవలసిన వైద్య విధానాలు, అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్సలపై అవగాహన కల్పించారు .ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శ్యామ్ కుమార్, వై. గోపికృష్ణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ సభ్యులు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ మూర్తి, వైద్యులు పాల్గొన్నారు
0 కామెంట్‌లు