మొహరం సందర్బంగా - పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఊరేగింపు గంగా నగర్ నాలా, యాకుత్‌పురాకు చేరుకున్నప్పుడు, ఎతేబార్ చౌక్ వైపు రోడ్లను బ్లాక్ చేస్తారు.
పురాణి హవేలీ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను చట్టా బజార్, దబీర్‌పురా లేదాఎస్జే రోటరీ వైపు మళ్లిస్తారు.
మొఘల్‌పురా, వోల్టా హోటల్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బీబీ బజార్ చీ రోడ్లో పారిస్ కేఫ్ లేదా తలాబ్ కట్టా వైపు మళ్లిస్తారు.
ఊరేగింపు ఎతేబార్ చౌక్‌కు చేరుకున్నప్పుడు, మిట్టి`కా`షేర్ మరియు మదీనా నుంచి ట్రాఫిక్‌ను గుల్జార్ హౌస్ వద్ద మదీనా లేదా మిట్టి`కా`షేర్ వైపు మళ్లిస్తారు.
ఊరేగింపు కోట్లా అలీజాకు చేరుకున్నప్పుడు, మొఘల్‌పురా వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను చౌక్ మైదాన్ ఖాన్ వైపు అనుమతించరు, హఫీజ్ డంకా మసీదు వద్ద పారిస్ కేఫ్ లేదా బీబీ బజార్ వైపు మళ్లిస్తారు.
ఊరేగింపు చార్మినార్‌కు చేరుకోగానే గుల్జార్ హౌస్ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు.
షక్కర్‌కోట్ నుంచి ట్రాఫిక్ మిట్టి`కా`షేర్ జంక్షన్ వద్ద ఘాన్సీ బజార్ లేదా చెలాపురా వైపు మళ్లించనున్నారు.
ట్రాఫిక్ ఎతేబార్ చౌక్ వద్ద కోట్ల అలీజా లేదా పురానీ హవేలీ వైపు మళ్లించనున్నారు.
నయాపూల్ నుంచి ట్రాఫిక్ మదీనా ఎక్స్ రోడ్ వద్ద సిటీ కాలేజీ వైపు మళ్లించనున్నారు.
ఊరేగింపు విూరాలం మండికి చేరుకున్నప్పుడు, చాదర్‌ఘాట్ రోటరీ, నూర్ఖాన్ బజార్, సాలార్జంగ్ మ్యూజియం, శివాజీ బ్రిడ్జ్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను పురానీ హవేలీ వైపు అనుమతించరు. అలాగే సాలార్ జంగ్ రోటరీ వద్ద నయాపూల్, శివాజీ బ్రిడ్జ్ మరియు నూర్ఖాన్ బజార్ వైపు మళ్లిస్తారు.
ఊరేగింపు అలవా సర్తూక్‌కు చేరుకునేటప్పుడు, చాదర్‌ఘాట్ రోటరీ నుండి వచ్చే ట్రాఫిక్‌ను కాలీ ఖబర్ వైపు అనుమతించరు. దానిని చాదర్‌ఘాట్ రోటరీ వద్ద రంగ మహల్ లేదా కోటి వైపు చాదర్‌ఘాట్ వంతెన విూదుగా మళ్లిస్తారు.
గౌలిగూడ లేదా అఫ్జల్‌గంజ్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సాలార్ జంగ్/శివాజీ బ్రిడ్జ్ వైపు అనుమతించరు. సాలార్ జంగ్/శివాజీ బ్రిడ్జ్ ప్రవేశద్వారం వద్ద గౌలిగూడ వైపు మళ్లిస్తారు.
ఊరేగింపు అలవా సర్టౌక్‌కు చేరుకున్నప్పుడు, ూఏ రోటరీ వైపు ట్రాఫిక్ నయాపూల్ వద్ద మదీనా వైపు మళ్లిస్తారు.
బస్సులకు ట్రాఫిక్ ఆంక్షలు:
జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులపై ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షాలు విధించారు. ఈ సమయాల్లో వచ్చే బస్సులు రంగ్ మహల్, అఫ్జల్ గంజ్ వైపు నుంచి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు నిర్దేశించారు. అలాగే మొహర్రం ఊరేగింపు ముగిసే వరకు బస్సులను కాళికాబర్, విూరాలంమండి రహదారి వైపు అనుమతించరు.