Ticker

6/recent/ticker-posts

Ad Code

Hyderabad లో మరో 5రోజుల పాటు వానలు


హైదరాబాద్‌, జూలై 20, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌లో మరో ఐదు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. జోన్ల వారీగా ఏరోజు ఏ స్థాయిలో కురిసే అవకాశం ఉందని వెల్లడిరచింది. అయితే చార్మినార్‌, ఖైరతాబాద్‌, కూకట్‌ పల్లి, ఎల్బీ నగర్‌, సికింద్రాబాద్‌, శేరి లింగంపల్లి జోన్లలో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని వివరించింది. 21, 22వ తేదీల్లో ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని సూచంచింది. 23, 24వ తేదీల్లో తేలిక పాటి వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. ‘‘ఆకాశం సాధారణంగా మేఘావృతంమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం నిర్విరామంగా కురుస్తుంది. కొన్నిసార్లు భారీ జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 25 డిగ్రీలు, 22 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. ఉపరిత గాలులు పశ్చిమ, నైరుతి దశ నుంచి గంటకు 12 నుంచి 16 కిలోవిూటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 24.0 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.8 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 97 శాతంగా నమోదైంది. అలాగే 43.3 మిల్లీ విూటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని అన్ని జోన్‌లలో ఇవాళ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. 21 22 తేదీల్లో ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. 23 నుంచి వాతావరణ సాధారణ పరిస్థితికి చేరుకుంటుంది. అందుకే ప్రభుత్వం కూడా అప్రమత్తమై తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. రెండు రోజుల పాటు బడులు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకటన వచ్చే సరికి చాలా మంది పిల్లలు స్కూల్స్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయా పాఠశాలల యాజమాన్యులు వారిని తిరిగి ఇంటికి పంపించారు. రెండు రోజులు పాటు వర్షాలు దంచికొట్టనున్నాయన్న వాతావరణ శాఖాధికారుల హెచ్చరికతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు బయటకు రావద్దని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరి నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


ఇప్పటికే  నాలాలు పొంగడంతో పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారాలు నీట మునిగాయి.హైదరాబాద్‌లో పలు చోట్ల  చెట్లు విరిగిపడ్డాయి. దీంతో జిహెచ్‌ ఎంసీకి  60కిపైగా ఫిర్యాదులు అందాయి. మాదాపూర్‌ 5 సెం.విూ, కెపిహెచ్‌ బి 4.98 సెం.విూ, మూసాపేట 4.73 సెం.విూ, జూబ్లీ హిల్స్‌  4.65 సెం.విూ. మియాపూర్‌ లో 7.40 సెం.విూ.వర్షపాతం నమోదు అయింది. టోలీ చౌకీ 6.65 సె.విూ, హైదరాదాద్‌ 5.68 సెం.విూ వర్షపాతం రిజిస్టర్‌ అయింది. 

ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు :

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడైనా సమస్యలు ఉంటే డిజాస్టర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి చెప్పవచ్చు. ఆ సెంటర్‌ ఫోన్‌ నెంబర్లు` 9000113667, 04029555500, 040`29860528, 040`29560584, 040`29560591 వీటితోపాటు సోషల్‌ విూడియా వేదికగా కూడా ఫిర్యాదులు చేయవచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు