హైదరాబాద్, జూలై 20 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా తేదీ 21,22 తేదీలలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవులు ప్రకటించింది.ఇంతకు ముందే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వంలోని అత్యవసర విభాగంలోని శాఖలు ఎమర్జెన్సీ సర్వీసులు యధావిధిగా పనిచేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.
0 కామెంట్‌లు