అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. లోకేష్ కనగరాజ్, అనిరుధ్ కలయికలో ఇది హ్యాట్రిక్ సినిమాగా నిలవనుంది. ఇప్పటికే దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్, అనిరుధ్ కలయికలో ‘మాస్టర్’ లాంటి సంచలన ఆడియో వచ్చింది. అదే స్థాయిలో దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా ‘లియో’ నుంచి విడుదలైన ‘నా రెడీ’ అనే మొదటి పాటకు విశేష స్పందన లభించింది. ఎన్నో ఆసక్తికర అంశాలు, హంగులతో రూపుదిద్దుకుంటున్న ‘లియో’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2023 అక్టోబర్ 19న విడుదలవుతోంది.
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొంది ప్రశంసలు పొందిన ‘మాస్టర్’ చిత్రాన్ని నిర్మించిన ఎస్.ఎస్. లలిత్ కుమార్ ‘లియో’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్టర్ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన జగదీష్ పళనిసామి ఈ యాక్షన్ బొనాంజాకు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
లియో సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ రంగంలోకి అడుగుపెట్టాలని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్ణయించుకుంది. ఇలాంటి సంచలన సినిమాతో పంపిణీ రంగంలోకి అడుగుపెడుతుండటం సంతోషంగా ఉందని, దళపతి విజయ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన మార్కెట్, పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని తెలుగులో ఆయన చిత్రాలకు మునుపెన్నడూ లేని విధంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నామని సితార సంస్థ పేర్కొంది.
ఈ యాక్షన్ ఎపిక్‌కి సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస, ఎడిటర్ గా ఫిలోమిన్ రాజ్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిరచనున్నారు.
0 కామెంట్‌లు