దేవీపట్నం, జులై 19 (
ఇయ్యాల తెలంగాణ) : అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గండి పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని వరద ప్రవాహం చుట్టుముట్టింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద భారీగా వచ్చి చేరింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి నీటిమట్టం అంతకంతకూ పెరగడంతో బుధవారం ఉదయానికి గండిపోచమ్మ ఆలయంలోకి వరదనీరు చేరింది. దీంతో ఆలయంలో దర్శనాలను దేవాదాయశాఖ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆలయ సవిూపంలోని స్థానికులు దుకాణాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు.
0 కామెంట్‌లు