Ticker

6/recent/ticker-posts

Ad Code

కిషన్‌ రెడ్డి అరెస్ట్‌... హై డ్రామా !


హైదరాబాద్‌, జూలై 20, (ఇయ్యాల తెలంగాణ) : 

👉నేనేమైనా టెర్రరిస్టునా? 

👉నా బండినే ఆపుతారా?.. 

👉కేంద్ర మంత్రి కాన్వాయ్‌కి వెహికిల్‌ అడ్డం పెడతారా..? 

👉లా అండ్‌ ఆర్డర్‌ బాధ్యత నాపై కూడా ఉంది.. 

👉డబుల్‌ బెడ్రూం ఇళ్ళను పరిశీలిస్తే విూకేంటి బాధ.. 

అంటూ కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ పోలీసులపై ఫైర్‌ అయ్యారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లను పరిశీలించేందుకు వెళ్తే విూకేంటంటూ పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగడుతూ.. బాట సింగారంలోని డబుల్‌ బెడ్రూం ఇళ్లను పరిశీలించేందుకు.. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఛలో బాట సింగారం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఛలో బాట సింగారం కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. ఉదయం నుంచే.. పోలీసులు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి బాటసింగారం వెళ్తుండగా.. పోలీసులు కిషన్‌ రెడ్డితోపాటు.. రఘునందన్‌ రావు, పలువురు బీజేపీ రాష్ట్ర నేతలను అడ్డుకున్నారు. దీంతో కిషన్‌ రెడ్డి వర్షంలోనే రోడ్డుపై భైటాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు , పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.అనంతరం కిషన్‌ రెడ్డి సహా.. పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి.. కేంద్రమంత్రి కాన్వాయ్‌ లోనే తరలించారు. నాంపల్లి బీజేపీ కార్యాలయానికి తరలిస్తున్నారు. కిషన్‌రెడ్డి, రఘునందన్‌ అరెస్టుకు ముందు.. నాయకులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు. బీజేపీ నేతలు అందరినీ.. నగరంలోని పలు పోలీసు స్టేషన్లకు తరలించారు. కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో భగ్గుమన్న బీజేపీ కార్యకర్తలు.. పోలీసు వాహనాలకు అడ్డుగా నిల్చొని ఆందోళన చేశారు.అయితే, బాటసింగారం పోరుబాటకు పర్మిషన్‌ అడగలేదని.. అందుకే బీజేపీ నేతల ముందస్తు హౌస్‌ అరెస్ట్‌లు చేశామని పోలీసులు తెలిపారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో కార్యక్రమానికి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారని.. ఇది పార్టీ పరమైన కార్యక్రమం కాబట్టే కిషన్‌రెడ్డిని అభ్యర్థించామని.. చివరకు అరెస్టు చేశామని తెలిపారు. దీంతో ఓఆర్‌ఆర్‌ పై ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

ఛలో బాట సింగారం

 ఛలో బాట సింగారం.. తెలంగాణ రాజకీయాలను మరింత హీటెక్కించింది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తలపెట్టిన ‘ఛలో బాట సింగారం’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను పరిశీలించేందుకు వెళుతున్న బీజేపీ నాయకులను ముందుస్తు అరెస్ట్‌ చేసిన పోలీసులు.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని అడ్డుకున్నారు. బాట సింగారం వెళ్తున్న కిణషన్‌ రెడ్డిని అడ్డుకోవడంతో.. ఆయన పోలీసులపై ఫైర్‌ అయ్యారు. ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులను నిలదీశారు. దీంతో శంషాబాద్‌ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. బీజేపీ నేతలు ? పోలీసుల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే పలువురని పోలీసులు అరెస్టు చేసిన పోలీసులు.. బాట సింగారం వెళ్లడానికి అనుమతి లేదంటూ పేర్కొంటున్నారు. చివరకు కిషన్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి.. పోలీస్‌ స్టేషన్‌ కు తరలిస్తున్నారు.ఛలో బాట సింగారానికి పిలుపునిస్తే ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్‌లు చేస్తోందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. ఆంధ్రా పాలకులు ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ఇచ్చిన హావిూ ప్రకారం పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని ఈటల డిమాండ్‌ చేశారు.

పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తన 

కేంద్రమంత్రి పట్ల తెలంగాణ పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. కచ్చితంగా ప్రభుత్వం తీరుపై, పోలీసుల ప్రవర్తనపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఓ వైపు పార్లమెంట్‌ నడుస్తుండగానే కేంద్రమంత్రిపై దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో మోసం చేస్తుంటే ప్రతిపక్షంగా బీజేపీ అడగతం తప్పా అని నేతలు ప్రశ్నింస్తున్నారు. పరిశీలనకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. ఉదయం ఐదు గంటల నుంచే పోవలీసలులు తమ వాహనాలను తీసుకొచ్చి ఇళ్ల చుట్టూ మోహరించారని ఆరోపించారు డీకే అరుణ. బాటసింగారం వద్ద డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను పరిశీలించాలని బీజేపీ నిర్ణయిస్తే జంటనగరాల్లో ఉన్న బీజేపీ నాయకులను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు ఈటల రాజేందర్‌. ప్రతీసారి అధికార పార్టీకి ఇది అలవాటుగా మారిందన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు చేసే హక్కు ప్రతిపక్షాలకు ఉందని... ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు. కేసీఆర్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమను నిర్బంధించినంత మాత్రాన పోరాటం ఆగదని... కేసీఆర్‌ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని... అరెస్టులు కొత్తకాదని అభిప్రాయపడ్డారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు