లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గర్భిణులను సురక్షితంగా
హాస్పిటల్ కు తరలించాలి : ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశం
ములుగు, జులై 19 (ఇయ్యాల తెలంగాణ) : గత రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. వాగులు వంకలు పొంగడం వలన పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రామన్న గూడెం పుష్కర ఘాట్ వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం ముంపు ప్రాంతాలను పరిశీ?లించి అక్కడ ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఏటూరు నాగారం ఎఏస్పీ సంకీర్త్ అధికారులను ఆదేశించారు.
ములుగు జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు ,వంకలు పొంగిపొర్లుతున్నాయి.ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం లోని అల్లం వారి ఘనపురం వద్ద పెద్ద ఒర్రే పొంగి పొర్ల డంతో అల్లం వారి ఘనపురం,చెల్పక, వీరాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ,పోలీస్ అధికారులు ఎలిషేట్టి పల్లి లోని జంపన్న వాగు వద్ద పోలీస్ రెస్క్యూ టీమ్,మరియు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల ద్వారా రెండు బోట్ లను ఏర్పాటు చేశారు. కన్నాయి గూడెం మండలంలో దెయ్యాల వాగు పొంగిపొర్లుతున్నాయి.దీంతో ఐలాపురం గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. ఏటూరు నాగారం మండలం లోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి క్రమేపీ పెరుగుతుంది.ప్రస్తుత నీటి మట్టం 11.60 విూటర్లు చేరుకుంది.కన్నాయి గూడెం మండలం తుపాకులగుడెం సమ్మక్క బ్యారేజ్ వద్ద 45 గేట్లను ఎత్తివేసి వరద నీటిని వదిలేశారు.ఎలి షెట్టి పల్లి వద్ద ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఏటూరు నాగారం ఎఎస్పీ సంకీర్ట్ బోటును ఏర్పాటు చేసి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ..
రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని,వాతావరణ శాఖ ఎల్లో ఆరెంజ్ జారీ చేశారని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ త్రిపాఠి అన్నారు.ఎలిశెట్టి పల్లి వద్ద జంపన్న వాగు ఉదృతి ఎక్కువగా ఉండడం తో ఎలిషెట్టీ పల్లి లో నివసించే 150 మంది గ్రామస్తులను చేల్పక ఆశ్రమ పాఠశాలలో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
0 కామెంట్‌లు