Ticker

6/recent/ticker-posts

Ad Code

ఖజానాకు భారీ ఆదాయం

  
విజయవాడ, జూలై 19, (ఇయ్యాల తెలంగాణ ):ఏపీ ఖజానాకు భారీగా ఆదాయం లభిస్తోంది. తొలి మూడు నెలల్లో పలు శాఖల ఆదాయం భారీగా పెరిగింది. ఆదాయాన్నిచ్చే శాఖలపై సీఎం జగన్‌ సవిూక్షి నిర్మహించారు. పలు శాఖల ఆదాయం పెరిగిందని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు.కాగా ఏపీ రిజిస్ట్రేషన్లు, గనులు, ఖనిజాల శాఖలకు భారీగా ఆదాయం వచ్చింది. తొలి మూడు నెలల్లోనే రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 500 కోట్ల ఆదాయం లభించింది. గత ఏడాది ఏప్రిల్‌1, ` జులై 15 మధ్య రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 2,290 కోట్ల రూపాయలు కాగా ఈ ఏడాదిలో రూ. 2793 కోట్లు వచ్చింది.ఇక గనుల శాఖలోనూ ఆదాయం మూడిరతలు పెరిగింది. 2020` 2021లో ఏపీఎవ్డిూసీ ఆదాయం రూ. 502 కోట్లు కాగా 2022`2023లో రూ. 1806 కోట్లకు ఆదాయం పెరిగింది. మూడు నెలల్లోనూ ఆదాయం ఎక్కవగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ ఎండీసీ ఆదాయం రూ.4 వేల కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మద్యం విక్రయాలపై ఆదాయం కూడా పెరిగింది. గతంతో పోల్చితే మద్యం అమ్మకాలు తగ్గాయని, అదే సమయంలో ఆదాయం పెరిగిందని అధికారులు స్పష్టం చేశారు.

మద్యం... అమ్మ కాలు

గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయని, అదే సమయంలో ఆదాయం పెరిగింది .2018?19తో పోలిస్తే  మద్యం అమ్మకాలు తగ్గాయని, 2018?19లో లిక్కర్‌ అమ్మకాలు 384.36 లక్షల కేసులు కాగా, 2022?23లో 335.98 లక్షల కేసులు, 2018?19లో బీరు అమ్మకాలు 277.16 లక్షల కేసులు కాగా, 2022?23లో 116.76 లక్షల కేసులు విక్రయాలు జరిగినట్లు వెల్లడిరచారు. 2018?19 ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలతో పోల్చిచూస్తే, 2023?24లో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలో బీరు అమ్మకాల్లో మైనస్‌ 56.51 శాతంగా నమెదయ్యిందని,  లిక్కర్‌ అమ్మకాల్లో మైనస్‌ 5.28 శాతంగా ఉందని అధికారులు వెల్లడిరచారు.

పెరిగిన రిజిస్ట్రేషన్‌ ఆదాయం...

గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందని ఈసందర్బంగా అదికారులు ముఖ్యమంత్రికి వివరించారు.  గత ఏడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి జులై 15 వరకూ రూ. 2291.97 కోట్లు, కాగా ఈ ఆర్ధిక సంవత్సరం ఇప్పటి వరకు రూ. 2793.7 కోట్లు ఆదాయం వచ్చిందని నివేదికలో స్పష్టం చేశారు. రీ సర్వే పూర్తి చేసుకున్న గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభం అయ్యాయని, అయితే వాటిని మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. 5 వేల రిజిస్ట్రేషన్‌ సేవలు గ్రామ సచివాలయాల్లో జరిగాయని, ఈ తరహా విధానాలను మరింతగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. వీటి ద్వారా రూ. 8.03 కోట్ల ఆదాయం వచ్చిందని సర్కార్‌ లెక్కలు చెబుతున్నాయి. గనులు ? ఖనిజాల శాఖ నుంచి గడచిన మూడేళ్లలో 32 శాతం సీఏజీఆర్‌ సాధ్యమైందని , 2018?19లో శాఖ నుంచి ఆదాయం రూ. 1,950 కోట్లు వస్తే, 2022?23 నాటికి రూ. 4,756 కోట్లు వచ్చిందని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. 2724 మైనింగ్‌ లీజుల్లో,  1555 చోట్ల తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, మిగిలిన చోట్ల కూడా పనులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. ఏపీఎండీసీ ఆర్థిక పని తీరు గణణీయంగా మెరుగు పడిరదని, 2020?21లో ఏపీఎండీసీ ఆదాయం కేవలం రూ.502 కోట్లు కాగా, 22?23లో రూ.1806 కోట్లకు పెరిగిన ఆదాయం, పెరిగిందని వెల్లడిరచారు. 2023?24 నాటికి రూ.4వేల కోట్లకు ఏపీ ఎండీసీ ఆదాయం చేరుతుందని అంచనా వేసినట్లు అదికారులు చెబుతున్నారు. మంగంపేట బైరటీస్‌, సులియారీ బొగ్గుగనుల నుంచి భారీగా ఆదాయం ఆర్జిస్తున్న ఏపీఎండీసీ, సులియారీ నుంచి ఈ ఏడాది 5 మిలియన

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు