Ticker

6/recent/ticker-posts

Ad Code

ఇక Water ప్రాబ్లమ్‌ కు చెక్‌


హైదరాబాద్‌, జూలై 19, (ఇయ్యాల తెలంగాణ ): భాగ్యనగర వాసులకు హైదరాబాద్‌ జల మండలి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. త్వరలోనే తాము తీసుకురాబోయే ఓ అద్భుతమైన ప్రాజెక్టు ద్వారా నగరంలో శాశ్వతంగా నీటి సమస్య లేకుండా చేయాలని భావిస్తోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ 158 కిలో విూటర్ల మేర భారీ పైప్‌ లైన్లు, రిజర్వాయర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా నీటిని సప్లై చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం కృష్ణ, గోదావరి, సింగూరు, మంజీరా ప్రాజెక్టుల నుంచి ప్రతిరోజూ దాదాపు 2000 మిలియన్‌ లీటర్ల నీరు నగరంలోకి సప్లై అవుతోంది. అయినప్పటికీ భాగ్యనగరంలోని ప్రజలకు ఈ నీళ్ల సరిపోవడం లేదు.హైదరాబాద్‌ లో పెరుగుతున్న జనాభాతో నీటి వాడకం బాగా పెరిగిపోయింది. అలాగే జలవనరులు తగ్గిపోవడంతో నీటి కొరత మరింత ఎక్కువైంది. అయితే ఈ సమస్యలకు శాశ్వతంగా చెక్‌ పెట్టేందుకే ఈ భారీ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు.     

 ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ 12 భారీ స్టోరేజ్‌ రిజర్వాయర్లను నిర్మించబోతున్నారు. వీటి నిల్వ సామర్థ్యం 12 మిలియన్‌ లీటర్లు ఉంటుంది. 615 కిలో విూటర్ల మేర నీటి పంపిణీ పైప్‌ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.5,376 కోట్లు. ఓఆర్‌ఆర్‌ చుట్టూ 3 విూటర్ల వ్యాసార్థంతో భారీ పైప్‌ లైన్‌ ను నిర్మించబోతున్నారు. ఈ పైప్‌ లైన్‌ కోసం ఏకంగా రూ.550 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఓఆర్‌ఆర్‌ లోపల 18 చోట్ల రేడియల్‌ మెయిన్‌ పైప్‌ లైన్లను నిర్మిస్తారు. అలాగే ఈ రేడియల్‌ పైప్‌ లైన్‌ కోసం రూ.250 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు కనుక విజయవంతంగా పూర్తి అయితే నగరంలో 24 గంటల నీటి సరఫరాకు అవకాశం ఉంటుంది. నగరం అంతటా కృష్ణా, గోదావరి, మంజీరా సింగూరు జలాలు విస్తరిస్తారు. ఏటా 20 టీఎంసీల నీటిని తరలించవచ్చు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే నగరంలో 24 గంటల వాటర్‌ సప్లై ఇవ్వొచ్చని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు