Ticker

6/recent/ticker-posts

Ad Code

NDA.... వర్సెస్‌ ఇండియా

హైదరాబాద్ ,జులై 19,(ఇయ్యాల తెలంగాణ ): విపక్ష కూటమికి కొత్త పేరు ఖాయమైంది.కాంగ్రెస్‌ సారధ్యంలో ఇన్నాళ్లూ కొనసాగిన యూపీఏ స్థానంలో ఇక ‘ఇండియన్‌ నేషనల్‌ డెవలప్మెంటల్‌ ఇన్‌ క్లూజివ్‌ అలయన్స్‌` ఇండియా  అనే కూటమి రూపుదిద్దుకుంది. విపక్ష నేతల సమావేశంలో ఈ పేరును ఖాయం చేశారు. బెంగళూరులో జరిగిన విపక్ష నేతల సమావేశంలో 26 పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాని పీఠంపైననో లేదా అధికారంపైననో ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే కాంగ్రెస్‌ లక్ష్యమన్నారు. 2024 లో బీజేపీని ఓడిరచడం లక్ష్యంగా విపక్ష పార్టీలు ఏకం అవుతున్నాయన్నారు. 2024 ఎన్నికలు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు, విపక్ష ‘ఇండియా’ కు మధ్యనే జరుగుతాయన్నారు. బెంగళూరులో జరుగుతున్న విపక్ష కూటమి నాయకులను ఉద్దేశించి ఖర్గే తో పాటు రాహుల్‌ గాంధీ, మమత బెనర్జీ, ఉద్ధవ్‌ ఠాక్రే, అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితర భాగస్వామ్య పార్టీల నాయకులు ప్రసంగించారు.అలాగే, తదుపరి సమావేశం ముంబైలో నిర్వహించాలని నిర్ణయించారు.విపక్ష కూటమికి కొత్త పేరు ఖాయమైంది. కాంగ్రెస్‌ సారధ్యంలో ఇన్నాళ్లూ కొనసాగిన యూపీఏ స్థానంలో ఇక ‘ఇండియన్‌ నేషనల్‌ డెవలప్మెంటల్‌ ఇన్‌ క్లూజివ్‌ అలయన్స్‌` ఇండియా అనే కూటమి రూపుదిద్దుకుంది. బెంగళూరులో జరిగిన విపక్ష నేతల సమావేశంలో ఈ పేరును ఖాయం చేశారు. అలాగే, తదుపరి సమావేశం ముంబైలో నిర్వహించాలని నిర్ణయించారు.బెంగళూరులో  జరగిన విపక్ష నేతల కీలక సమావేశంలో కూటమి పేరుపై నిర్ణయంతో పాటు పలు ఇతర ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఢల్లీిలో కూటమి కోసం ఒక కామన్‌ సెక్రటేరియట్‌ ను ఏర్పాటు చేయాలని, అలాగే, 11 మంది సభ్యులతో ఒక సమన్వయ కమిటీ  ని నియమించాలని నిర్ణయించారు. ‘ఇండియా’ నేతల తదుపరి సమావేశం ముంబై లో నిర్వహించాలని నిర్ణయించారు. ఆ భేటీ ఎప్పుడు జరపనున్నది త్వరలో ప్రకటిస్తామని వెల్లడిరచారు. సమన్వయ కమిటీ సభ్యుల పేర్లను కూడా ముంబై సమావేశంలో ప్రకటిస్తామని తెలిపారు.2024 లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమైందని తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. విపక్ష కూటమి ‘ఇండియా’ ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎదుర్కోలేదని, ‘ఇండియా’ దే ఘన విజయమని ధీమా వ్యక్తం చేశారు. ‘ఇండియా’ ను ఎన్డీయే ఎదుర్కోగలదా? అని ప్రశ్నించారు. 2024 ఎన్నికల పోరు ఇండియా, ఎన్డీయే అనే రెండు రాజకీయ కూటముల మధ్య పోరాటం కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఇండియా అనే భావనను కాపాడే లక్ష్యంతో తమ పోరాటం ఉంటుందని రాహుల్‌ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల పోరు నరేంద్ర మోదీకి, ఇండియా అనే ఐక్య భావనకు మధ్య జరగబోతందన్నారు.సమావేశం అనంతరం సమావేశంలో పాల్గొన్న పార్టీలు ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. అధికారంలోకి వస్తే కుల గణన చేపడ్తామని ఆ ప్రకటనలో స్పష్టం చేశాయి. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత లభించాలన్నది మా లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో భాగంగా మొదట కుల గణన ను అమలు చేస్తాం.’’ అని సామూహిక్‌ సంకల్ప్‌ పేరుతో విడుదల చేసిన ఆ ఉమ్మడి ప్రకటనలో వెల్లడిరచాయి. ‘‘దేశానికి ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక, సామాజిక, రాజకీయ ఎజెండాను తీసుకువస్తాం. విద్వేషాన్ని, మైనారిటీలు, దళితులు, మహిళలు, ఆదివాసీలు, కశ్మీరీ పండిట్ల పై హింసను ఓడిరచే లక్ష్యంతో మేమంతా ఒక్కటయ్యాం’’ అని ఆ ప్రకటనలో తెలిపాయి.‘విపక్ష కూటమి భారత్‌ ను ప్రతిబింబిస్తుంది. అందుకే ఇండియా అనే పేరు కూటమికి సరిగ్గా సరిపోతుంది. ఈ పేరు కూడా బీజేపీ ని బాధ పెడుతుంది’ అని ఆర్జేడీ ఒక ట్విటర్‌ పోస్ట్‌ లో పేర్కొంది. అయితే, కాసేపటికి ఆ ట్వీట్‌ ను డిలీట్‌ చేసింది. ‘‘2024 ఎన్నికలు టీమ్‌ ఇండియా కు టీమ్‌ ఎన్డీయే మధ్య జరగబోతున్నాయి’’ అని శివసేన ఉద్ధవ్‌ వర్గం నేత ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యానించారు. దానికి స్పందనగా చక్‌ దే ఇండియా  అంటూ టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓ బ్రీన్‌ ట్వీట్‌ చేశారు. ‘ఇండియా గెలవబోతోంది’ అని లోక్‌ సభ ఎంపీ మానికం టాగోర్‌ ట్వీట్‌ చేశారు.విపక్ష కూటమిని అత్యంత అవినీతిమయమైన కూటమిగా ప్రజలు భావిస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ఆ కూటమిలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి బెయిల్‌ పై ఉన్నవారికి గొప్ప గౌరవం లభిస్తుంది. మొత్తం కుటుంబం అంతా అవినీతికి పాల్పడి బెయిల్‌ పై బయట ఉన్నవారికి మరింత గౌరవం లభిస్తుంది. అలాగే, ఒక వర్గాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేసి జైలు శిక్ష పడిన వారికి సన్మానాలు చేస్తారు’’ అని ప్రధాని మోదీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్‌ లో పంచాయత్‌ ఎన్నికల సమయంలో జరిగిన హింసపై, వారిపై ఉన్న అవినీతిపై ఆ కూటమిలో ఎవరూ మాట్లాడరని మోదీ వ్యాఖ్యానించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు