ముంబై, జూలై 20, (
ఇయ్యాల తెలంగాణ) : ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీలో యువ భారత్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. బుధవారం పాకిస్తాన్`ఏతో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 48 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. ఖాసిమ్ అక్రమ్ (48) టాప్ స్కోరర్. భారత బౌలర్లు రాజ్యవర్ధన్ హంగార్గేకర్ (5/42), మానవ్ సుతార్ (3/36) రాణించారు.
ఆపై సాయి సుదర్శన్ (104Ñ 110 బంతుల్లో 10్ఖ4, 3్ఖ6) సెంచరీ చేయడంతో భారత్ 36.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్, పాకిస్తాన్ జట్లు ఇదివరకే ఎమర్జింగ్ వన్డే ఆసియా కప్ 2023 సెవిూస్‌కు చేరాయి. అయితే ఈ టోర్నీలో దాయాదులు మరోసారి తలపడే అవకాశం ఉంది. శుక్రవారం జరిగే సెవిూస్‌లలో బంగ్లాదేశ్‌ను భారత్, శ్రీలంకను పాకిస్థాన్ ఢీకొంటాయి.
ఈ రెండు మ్యాచ్‌ల్లో విజేతలుగా నిలిచిన జట్లు ఆదివారం (జులై 23) కొలొంబో వేదికగా జరిగే ఫైనల్లో అవిూతువిూ తేల్చుకుంటాయి.ఎమర్జింగ్ వన్డే ఆసియా కప్ 2023 ఆటగాళ్ల ఫామ్ దృష్ట్యా శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే భారత్, పాకిస్తాన్ జట్లు బాగున్నాయి. బంగ్లాదేశ్‌ను భారత్, శ్రీలంకను పాకిస్థాన్ ఓడిరచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే ఆసియా కప్ 2023లో భారత్`పాక్‌లు మరోసారి తలపడటం ఖాయం. తొలి సెవిూస్ ఉదయం 10 గంటలకు ఆరంభం కానుండగా.. రెండో సెవిూస్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.
0 కామెంట్‌లు