Ticker

6/recent/ticker-posts

Ad Code

సికింద్రాబాద్ జోన్ అధ్యక్షులు కొడారి రాజు కు దళితరత్న అవార్డు


 సికింద్రాబాద్, ఏప్రిల్ 15 (ఇయ్యాల తెలంగాణ) :  భాగ్యనగర్ మునిసిపల్ జి.హెచ్.ఎం.సి ఎంప్లాయిస్ యూనియన్ (BMS) సికింద్రాబాద్ జోన్ అధ్యక్షులు కొడారి రాజు దళితరత్న అవార్డు అందుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 132వ జయంతి ఉత్సవ వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల కార్యక్రమంలో భాగంగా జయంత్యుత్సవాల కమిటీ కొడారి రాజు కు దళిత రత్న అవార్డు ను  ప్రకటించింది.  కార్మిక నాయకుడిగా గత అనేక సంవత్సరాలుగా జి.హెచ్.ఎం.సి లో విశిష్ట సేవలను అందిస్తూ మహాత్ముల జయంతి వేడుకలకు ఉద్యోగులు అనేక రంగాల్లో ముందుకు వెళ్ళడానికి రాజు ఏంతో కృషి చేశారు. కార్మిక వర్గాల్లో అనేక అపోహల్ని తొలంగించి వారు నిర్భయంగా ఉద్యోగాలు చేయడానికి ప్రోత్సాహము అందించారు. 


కరోనా సమయంలో కూడా ఏంతో మంది కార్మికులకు అండగా నిలిచారు. కార్మిక నాయకునిగా విశిష్ట సేవలు అందిస్తూ దళిత రత్న అవార్డును అందుకున్న రాజుకు తోటి ఉద్యోగులతో పాటు అనేక మంది ప్రశంసలు అభినందనలు అందించారు.  


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు