హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఇయ్యాల తెలంగాణ) : నవ తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సుల్తాన్ షాహీ లో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భారత రత్న డా! బాబా సాహెబ్ అంబేడ్కర్ 132 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని అశోక్ జండా సమీపంలో మహాత్ముల జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ సఫాయి కర్మచారి సభ్యులు చింత సాంబ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయనతో పాటు మరో అతిథి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధానకార్యదర్శి భగవంత్ రావు కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ నాయకులు ఎం.కుమార్ అధ్యక్షతన కొనసాగిన మహాత్ముల జయంతుత్సవాల వేడుకలో పలువురు ప్రముఖులు అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు వక్తలు కార్యక్రమంలో ప్రసంగించారు. అంబెడ్కర్ ఆశయ సాధనతో పాటు సంత్ రవిదాస్ కృషి అస్పృశ్యతను రూపు మాపడానికి నిరంతరం కొనసాగిందని జాతీయ సఫాయి కర్మచారి సభ్యులు చింత సాంబ మూర్తి అన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ విధానాలు దళితులకు, ఇతర నిమ్న వర్గాల ప్రజలకు ఏ మాత్రం లాభం లేకుండా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమాజంలో దళిత వర్గాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి నోచుకోకుండా పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. దళితుల కోసం నిరంతరం జరుగుతున్న సంఘర్షణపై చింత సాంబమూర్తి ఉద్వేగ భరిత ప్రసంగాన్ని చేశారు. ఏంతోమంది ఇప్పటికీ అనేక అగచాట్లు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం స్థాపించిన తెలంగాణ ప్రభుత్వం 2016 నుంచి ఎందుకు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహ ఏర్పాటుతో పాటు దళితులకు అందజేయాల్సిన 3 ఎకరాల భూమి సంగతి దళిత ముఖ్యమంత్రి గురుంచి ప్రజలకు తెలియ జేయాలని అన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు తో పాటు బీజేపీ నాయకులు పాశం సురేందర్, కౌడి మహేందర్, నవ తరంగిణి సంస్థ సభ్యులు ప్రేమ్ కుమార్, కె. నాగ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు