Ticker

6/recent/ticker-posts

Ad Code

రెచ్చిపోయిన చైన్‌ స్పాచర్లు


హైదరాబాద్‌,జనవరి 7 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌లో చైన్‌ స్నాచర్స్‌ రెచ్చిపోయారు. రెండు గంటల వ్యవధిలోనే ఆరు చోట్ల స్నాచింగ్‌కు పాల్పడ్డారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉప్పల్‌, నాచారం, ఉస్మానియా యూనివర్సిటీ, రాంగోపాల్‌ పేట్‌ సహా మొత్తం ఆరు చోట్ల ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. నడిచి వెళ్లే వారిని టార్గెట్‌ గా చేసుకున్న ఇద్దరు వ్యక్తులు పల్సర్‌ బైక్‌ పై తిరుగుతూ చోరీలకు పాల్పడ్డారు. ఉప్పల్‌ లో స్నాచింగ్‌ మొదలు పెట్టిన దుండగులు రాంగోపాల్‌ పేటలో ముగించారు. చోరీ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చోరీల అనంతరం బైక్‌ ను రాంగోపాల్‌ పేటలో వదిలివెళ్లారు దొంగలు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు