Ticker

6/recent/ticker-posts

Ad Code

ఎర్రబంగారం ఆల్‌ టైమ్‌ రికార్డు


సూర్యాపేట, జనవరి7 (ఇయ్యాల తెలంగాణ) : ఎండు మిర్చి ధర బంగారాన్ని దాటిపోయింది. నాన్‌ స్టాప్‌గా పరుగులు తీస్తుంది. తగ్గేదే లే అన్నట్లు దూసుకుపోతుంది. తాజాగా వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఎర్రబంగారం రికార్డుల మోత మోగించింది.  దేశీ కొత్త మిర్చి క్వింటాల్‌ కు 80,100 రూపాయలు పలికింది. ఈ ఏడాది ఇదే రికార్డు ధర అని చెబుతున్నారు. గత ఏడాది  90వేల రూపాయలకు పైగా పలికింది క్వింటా మిర్చి ధర. ఎన్నడూ లేని విధంగా మిర్చికి రికార్డు ధర రావడంతో సంతోషంలో మునిగితేలుతున్నారు రైతులు. దీన్ని బట్టి మిర్చికి డిమాండ్‌ ఎలా పెరిగింది, ధరలు ఎలా ఎగబాకుతున్నాయో అర్థమవుతుంది.దేశీ మిర్చి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మాత్రమే సాగు చేస్తారు. ఈ ప్రాంతంలో ఎర్రమట్టి నేలల్లోనే దేశీ మిర్చి పండుతుంది. అయితే దీని సాగు కత్తి విూద సామే. ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది. మిర్చి తోటలను పసిపిల్లల్ని సాకినట్టు కంటికి రెప్పలా కాపాడాలి. గట్టిగా ఒక్క వాన పడితే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఈసారి కూడా పంట చేతికొచ్చే సమయంలో టైమ్‌లో అకాల వర్షం వల్ల రైతులు నష్టపోయారు. దిగుబడి పడిపోయింది.హనుమకొండ జిల్లా పరకాల మండలానికి చెందిన ఓ  రైతు తన పంటను క్వింటాకు రూ.90 వేలకు చొప్పున అమ్మాడు. ఇదే ఇప్పటి వరకు రికార్డ్‌ ధర అని అధికారులు తెలిపారు. ఇంతటి ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశీ రకానికి డిమాండ్‌ పెరగడం, ఆఫ్‌ సీజన్‌ కావడంతో ఈ రేటు వచ్చిందని అధికారులు చెప్తున్నారు. లక్షకు చేరువలో మిర్చి ధర పలకడంతో మిర్చి రైతులు సంతోషంగా ఉన్నారు. 


రెండు వారాల క్రితం మిర్చి ధర క్వింటా రూ.65 వేలు పలికింది. దేశీ మిర్చికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉండడంతో ధర అమాంతం పెరిగింది. ఈ మిర్చిని పచ్చళ్లలో అధికంగా వినియోగిస్తారు. గతేడాది అకాల వర్షాలతో ఎండు మిర్చి దిగుబడులు తగ్గాయి.  తెగుళ్లు కూడా మిర్చి పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. ఏడాదికి 25, 30 క్వింటాళ్లు వచ్చే దిగుబడి కేవలం 10 నుంచి 15  క్వింటాళ్లు వచ్చాయి. దీంతో మార్కెట్లో మిర్చి సప్లై తగ్గిపోయింది. దీంతో రైతులు కాస్త మంచి ధరకే పంటను అమ్ముకున్నా దిగుబడి తగ్గిపోవడంతో నష్టాలు తప్పలేదు. మంచి ధరకోసం పంటను కోల్డ్‌ స్టోరేజీలలో దాచుకున్న రైతుల పంట పడిరది. తాజాగా మంచి రేటు పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి వరంగల్‌తో పాటు ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో పండిస్తున్న ఎండు మిర్చి అంతర్జాతీయ మార్కెట్‌ లోకి అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది కనీసం 20 వేల మెట్రిక్‌ టన్నుల ఎండు మిర్చిని సేకరించి రూ.10 కోట్ల లాభాన్ని ఆర్జించనున్నట్లు  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మహబూబాబాద్‌, వరంగల్‌, ములుగు, భూపాలపల్లి, హనుమకొండ సహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండుమిర్చి అధికంగా సాగుతోంది. ఈ మిర్చి నాణ్యతలో కూడా బాగుందని అధికారులు తెలిపారు. గతేడాది ఖమ్మం జిల్లాలో పొదుపు సంఘాల మహిళలు రూ.40 కోట్ల వ్యాపారం చేసి రూ.92 లక్షల లాభం పొందారు. రైతుల ఖాతాల్లో  విక్రయాలకు సంబంధించి 15 రోజుల్లో నగదు జయ అయింది. లాభంలో ప్రతి కిలోకు రూ.4 చొప్పున రైతులకు బోనస్‌ అందించారు. రైతుల కల్లాల వద్దే పంటను కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మిర్చి పంటకు భౌగోళిక గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.అయితే రికార్డు ధర పలకడంతో నష్టాల నుంచి గట్టెక్కుతామని రైతులు అంటున్నారు. ఏమైనా ఇక్కడ ఎర్రమట్టి నెలల్లోనే పండే ఎర్రబంగారం ఆల్‌ టైమ్‌ రికార్డు ధరతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈసారి పంట ఉత్పత్తి తగ్గడం, డిమాండ్‌ పెరగడం వల్లే మిర్చి ధరలు పసిడిని దాటి పరుగులు పెడుతున్నాయి అంటున్నారు నిపుణు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు