Ticker

6/recent/ticker-posts

Ad Code

MIM కార్పొరేటర్‌ కార్యాలయంలోయువకుడిపై కత్తులతో దుండగుల దాడి


హైదరాబాద్‌ డిసెంబర్‌ 19 (ఇయ్యాల తెలంగాణ) : పాత నగరంలో యువకుడి హత్య కలకలం సృష్టించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని లలిత్‌భాగ్‌ లో లలితాబాగ్ కార్పొరేటర్‌ కార్యాలయంలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. భవానీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లలితాభాగ్‌కు చెందిన ఏఐఎంఐఎం కార్పొరేటర్‌ ఆజం షరీఫ్‌ కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి, అతని మేనల్లుడు సయ్యద్‌ ముక్తాజాపై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలకు గురైన ముక్తాజాను పలువురు ఓవైసీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.


హత్యకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. కార్పొరేటర్‌ ఆజం షరీఫ్‌ సోదరి కొడుకే ముక్తాజా. మృతుడు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నాడు. అయితే, స్నేహితుల మధ్య గొడవే ఈ హత్యకు కారణమని తెలుస్తున్నది. కార్పొరేటర్‌ కార్యాలయంలో ఉండగానే ఏకకాలంలో దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆరుగురు వ్యక్తులు కలిసి ముర్తుజాపై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వెంటనే సయ్యద్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు