హైదరాబాద్, డిసెంబర్ 4 (ఇయ్యాల తెలంగాణ) : 50వ జిల్లా స్థాయి సైన్స్ గణిత పర్యావరణ ప్రదర్శన , INSPIRE అవార్డ్స్ జిల్లా స్థాయి ప్రదర్శన బండ్లగూడ మండల్ లోని ది ప్రోగ్రెస్ హై స్కూల్, ఫలక్ నుమా లో అట్టహాసంగా జరిగినది. ముఖ్యఅతిథి ప్రొఫెసర్ రవికుమార్ పులి ఎన్ఐటి వరంగల్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉన్న వనరులతోనే పరిష్కారం కనుగొనాలని బాల శాస్త్రవేత్తలకు సూచించారు. హైదరాబాద్ డీఈవో ఆర్. రోహిణి మాట్లాడుతూ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసే శక్తి విద్యార్థుల చేతుల్లో ఉందని కొత్త కొత్త ఆవిష్కరణలను రూపొందించవచ్చని బాల శాస్త్రవేత్తలకు చెప్పడం జరిగినది. జిల్లా సైన్స్ అధికారి సి.ధర్మేంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన లో సాంకేతికత మరియు బొమ్మలు ప్రధాన అంశం మరియు ఏడు ఉపాంశాల్లో అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల విద్యార్థులు తమ ప్రాజెక్టులు నమూనాలను తమ గైడ్ టీచర్ పర్యవేక్షణలో రూపొందించి ప్రదర్శించబడినవని తెలియజేశారు.